మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21 : ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధ్దిదారులందరికీ రుణ సదుపాయం కల్పించడానికి ఈ నెల 24 నుంచి మే 1 వరకు కిసాన్ బాగిదారి ప్రాథమిక్తా హమారీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. గురువారం సంబంధిత కార్యక్రమ వాల్ పో స్టర్‌ను జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్‌రావు, నాబార్డు డీడీఎం కృష్ణతేజ, ఇతర బ్యాంక్ అధికారులతో కలిసి కలెక్టరేట్లో ఆ విష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. పీఎం కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ను ఆదేశించిందన్నారు. ఈ నెల 24 నుంచి రుణాల మంజూరుపై అన్ని బ్యాంకులు ప్రత్యే క శిబిరాలు నిర్వహిస్తాయని వివరించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ, రెవె న్యూ అధికారులతోపాటు పంచాయతీ కార్యదర్శులు ఎన్‌ఎల్‌ఆర్‌ఎం ప్రాజెక్ట్ బ్యాంక్ అధికారులు లబ్ధ్దిదారులకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తులు స్వీకరించి వారం రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు అందజేస్తారన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుతో బ్యాంక్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ లేకుం డా నేరుగా రూ.3లక్షల వరకు రుణం తీసుకో వచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ, యూ బీఐ, యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్, ఏపీజీవీబీ, డీసీసీబీ అధికారులు పాల్గొన్నారు.