దుబ్బాక, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చేసి చూపిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా దవాఖానల్లో శానిటేషన్, డైట్‌తో పాటు మెడికల్స్, వైన్స్, ఫర్టిలైజర్స్ దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. పక్క రాష్ర్టాల్లో ఉన్న ప్రభుత్వాలు చేయలేని మహా అద్భుత కార్యక్రమమే ‘దళితబంధు’ పథకమన్నారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసి వారికి శాశ్వత ఉపాధి మార్గం చూపిం చి, ఆర్థిక స్వాలంబన చేకూర్చే దిశగా పాటు పడుతున్న ప్రభుత్వమంటే మన కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. గురువారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని దుబ్బాకలో ఫంక్షన్హాల్లో దళితబంధు కార్యక్రమం నిర్వహించారు.
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండలం ఆరెపల్లి, దౌల్తాబాద్ మండలం మ హమ్మద్షాపూర్ గ్రామాలకు చెందిన వంద మంది లబ్ధిదారుల కు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేతో కలిసి దళితపథ కం ప్రొసీడింగ్ పత్రాలు, యూనిట్లను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ముందుగా దళితబంధు లబ్ధిదారులతో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దుబ్బాకలో దళితబం ధు పథకంలో వంద మంది దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందడం సంతోషకరమన్నారు. దళితబంధులో వాహనాలు, ఇతర దుకాణాల నిర్వహణతో వచ్చే ఆ దాయం పొదుపు చేసుకొని, ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. దళితబంధు పథకంపై కొందరూ దుష్ప్రచారం చేశారని, రాష్ట్రమంతటా అమలు చేయలేరని, ఓట్ల కోసమే పెట్టారని ఎన్నో విమర్శలు చేశారన్నారు. దుబ్బాకలో ఇప్పుడు ఎన్నికలు లేవని, అయినా దళితబంధులో వంద మందికి ప్రయోజనం చే కూరలేదా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాదిలో మరో 1500 మందికి లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు.
కేంద్రప్రభుత్వం తెలంగాణకు హక్కుగా రావాల్సిన బీఆర్జీఏఫ్ నిధులు రూ. 1350 కోట్లు, 15 ఆర్థిక సంఘం ద్వారా రూ.750 కోట్లు ఇవ్వాలన్నారు. కేంద్రం ద్వారా న్యాయపరంగా రావాల్సిన మరో వెయ్యి కోట్లు ఉందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.3.5 వేల కోట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెప్పించాలని సూచించారు. కేంద్ర సర్కారు కావాలనే తెలంగాణ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. కేంద్రం కొనకపోతే ఏమి? సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలి చి, మద్దతు ధరతో కొంటున్నారన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి ఏడాదికి 3 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ప్రభు త్వ పథకాలను సద్వినియోగించుకోవాలని మంత్రి కోరారు.
దేశమే అబ్బురపడింది : ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
దళితుల ఆర్థిక స్వాలంబనకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దేశం మొత్తం అబ్బురపడిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దుబ్బాకలో దళితబంధు కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో నాయకులు ఉపన్యాసాలతో అదరగొట్టడం తప్పా, అంబేద్కర్ ఆశయ సాధనకు పని చేయడం లేదన్నారు. తెలంగాణ బడ్జెట్లో సింహభాగం దళితుల సంక్షేమానికి కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. కేసీఆర్‌తోనే బం గారు తెలంగాణ సాధ్యపడిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, డీఆర్డీవో గోపాల్‌రావు, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, దుబ్బాక, దౌల్తాబాద్ ఎంపీపీలు పుష్పలత, సంధ్య, జడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, రణం జ్యోతి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య, ఏఎంసీ చైర్పర్సన్ శ్రీలేఖ, వైస్ చైర్మన్ లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, ఆరెపల్లి సర్పంచ్ సంతోషలక్ష్మి పాల్గొన్నారు.