జహీరాబాద్, ఏప్రిల్ 10: పట్టణంలో మౌలిక సదుపాయలు కలిపించేందుకు సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తాన ని ప్రకటించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు శంకుస్థాపన చేసేందుకు నారాయణఖేడ్‌కు వచ్చిన సమయంలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. పట్టణంలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి, నిధులు కేటాయించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నిధులతో ప్రధానంగా ఎంఆర్‌హెచ్‌ఎస్ (మెథడిస్టు చర్చి) నుంచి అల్గోల్ బైపాస్ రోడ్డుకు, పస్తాపూర్ చౌరస్తా నుంచి గ్రామం వరకు, బాగారెడ్డి విగ్రహం నుంచి రాంనగర్ వరకు మధ్యలో డివైడరు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో సీసీరోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు అధికారులు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీర్ హరీశ్‌రావు గతంలో జహీరాబాద్‌లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేయడంతో మంత్రి మున్సిపల్లోని వార్డులు, కాలనీలు, గ్రామాల్లో పర్యటించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ హనుమంతరావు, ఆడిషనల్ కలెక్టర్ రాజార్షి షా, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ పలు వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోనున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు ప్రతిపాదలు సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆదేశవిం చారు. రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే పట్టణ రూపురేఖలు మరిపోతామరి అధికారులు చెబుతున్నారు.
డివైడర్లు నిర్మిస్తాం..
మున్సిపల్లో ప్రధాన రోడ్లను విస్తరించి, మధ్యలో డివైడర్లు నిర్మించి మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్తగా రెండు లేన్ల రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నారు. పట్టణంలో కర్ణాటక, మహారాష్ర్ట, గుజరాత్, రాజస్థాన్, తెలుగు రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు, ఉద్యోగులు నివాసముంటున్నారు. కర్ణాటకకు సమీపంలో ఉండడంతో అక్కడి రాజకీయలకు కేంద్రంగా జహీరాబాద్ మారిపోయింది.పస్తాపూర్, అల్గోల్, రాంనగర్ రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలతో పాటు రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మించి చెట్లు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మాణం
మున్సిపల్లో విలీనం చేసిన గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయలు కలిపించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత కలిపిస్తున్నది. అల్లీపూర్, రంజోల్, పస్తాపూర్, చిన్న హైదరాబాద్, హోతి(కే), తమ్మడ్‌పల్లి, బాబానగర్ శివారులో ఉన్న రెండు గిరిజన తండాల్లో సౌకర్యలు కలిపించేందుకు మున్సిపల్ అధికారులు సర్వే చేసి పనులు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. విలీన గ్రామాల్లో ఎక్కడ సమస్య ఉన్నా గుర్తించి సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు అధికారులకు సూచించారు. ప్రజలకు అత్యవసరంగా ఉన్న వాటిని గుర్తించి పనులు చేయాలని అధికారులు అంచన వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే జహీరాబాద్ మున్సిపల్‌ను ఆదర్శంగా నిర్మాణం చేసేందుకు కృషి చేస్తున్నారు.
మౌలిక సదుపాయల కల్పనకు కృషి
జహీరాబాద్‌లో మౌలిక సదుపాయలు కలిపించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభు త్వం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. మంత్రి హరీశ్‌రావుతో కలసి పట్టణంలోని ప్రధాన సమస్యలు గుర్తించి , వాటిని పరిష్కారించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. రోడ్లు వెంట చెట్లు పెంచి, డివైడర్లు నిర్మిస్తాం. విలీన గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనాలు సిద్ధం చేస్తున్నారు.
– కొనింటి మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
రాష్ట్ర ప్రభుత్వనికి రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ మున్సిపల్లో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు పాధాన్యత కలిపించారు. విలీన గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలు గుర్తించి, అభివృద్ధి పను లు చేసేందుకు ఎమ్మెల్యే మాణిక్‌రావు కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ మున్సిపల్ అన్ని రంగాల్లో ముందుకు పోతుంది.
– సయ్యద్ మోహినోద్దీన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జహీరాబాద్
అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేశారు. ఈ పనులకు ప్రతిపాదనాలు సిద్ధం చేస్తున్నారు. సమస్యను గుర్తించి పనులు చేస్తాం. విద్యుత్తు దీపాలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మున్సిపల్ పరిధిలోని 37 వార్డులో అభివృద్ధి పనులు చేసేందుకు సర్వే చేసి నివేదిక ప్రభుత్వానికి పంపించాం. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం.
– సుభాశ్‌రావు, మున్సిపల్ కమిషనర్ జహీరాబాద్