మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 9: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్నింటిని తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. చలి కాలంలో ఉన్ని దుస్తులు.. ఎండా కాలంలో కాటన్ వస్ర్తాలు ధరించినట్లే ఆహార నియమాలు పాటించాలి. ప్రస్తుతం వేసవి కాలం భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కొద్దిసేపు ఎండలో తిరిగితే శరీరం నిస్సత్తువుగా మారుతున్నది. శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు కాలానికి అనుగుణంగా కావాల్సిన ఆహారం తీసుకోవాలి. ఎండాకాలంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకొచ్చి డీహైడ్రేషన్ అవుతుంది. దీన్ని బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలి. ఇందుకోసం కొబ్బరిబోండాలు, అంబలి, శీతలపానీయాలు తాగుతుంటారు కొందరు.
తైద అంబలితో ఎంతో మేలు
ఎండాకాలంలో తైద (రాగులు) అంబలి తాగితే ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి చలువనివ్వడంతో పాటు ఎన్నో విలువైన పోషకాలు అందిస్తుంది. తైదల్లో చలువ చేసే గుణం ఉన్న ది. రోజూ అంబలి తాగితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అంబలి ఆరోగ్య పోషకం. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఆకలిని కూడా తీరుస్తుంది. ఒకప్పుడు గ్రామాలకే పరిమితమైన అంబ లి ఇప్పుడు పట్టణాలు, నగరాల్లోనూ లభిస్తున్నది. ప్రతిఒక్కరూ అంబలిని సేవించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్ని పట్టణాల్లో చలివేంద్రాల వలే అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్‌లోని బోరంచమ్మ ఆలయం పాలక మండలి అంబలి కేంద్రంతో పాటు చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో అంబలిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఆరోగ్యానికి మేలు.. ఎన్నో పోషక విలువలు
తైద అంబలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తైద అంబలి తాగొచ్చు. ముఖ్యంగా ఎండకాలంలో అంబలి తాగితే శరీరానికి చలువ చేస్తుంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎండలో తిరిగి వచ్చి అంబలిని తాగితే శరీరం ఉపశమనం పొందుతుంది. వడదెబ్బ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – డాక్టర్ శివదయాల్, ప్రభుత్వ వైద్యుడు, మెదక్
ఉపయోగాలెన్నో…
అంబలి సేవిస్తే వడ దెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు.
ఇనుము ఎక్కువగా ఉండడంతో రక్తహీనతను నివారిస్తుంది.
పెరుగుదల, ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది.
గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది.
సజావుగా పని చేయడానికి దోహదం చేస్తుంది
ఉండే పీచు పదార్థం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలుచేస్తుంది.
పిల్లలకు అనుబంధ ఆహారంగా రాగి జావా తాగించొచ్చు.