మనోహరాబాద్, ఏప్రిల్ 9 : గ్రామాలాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ. 27లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను స్థానిక ప్రజాప్రతినిధులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో గ్రామాలను పట్టిం చుకున్న నాథుడే లేడన్నాడు. గ్రామంలో చిన్న అభివృద్ధి పని కావాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ అడగకముందే నిధులను మంజూరు చేస్తూ గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. దండుపల్లిలో అంగన్వాడీ నిర్మాణానికి రూ.5లక్షలు, రంగాయిపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5లక్షలు, మనోహరాబాద్‌లో యాదవ సంఘం భవనానికి రూ.5లక్ష లు, గౌతోజిగూడెంలో మురుగునీటికాల్వల నిర్మాణానికి రూ. 5 లక్షలు, పోతారం గ్రామంలో రోడ్డు నిర్మాణానికి రూ. 2 లక్షలను మంజూరైనట్లు జడ్పీ చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ మాదవరెడ్డి, నాయకులు నాగరాజు, సురేందర్‌రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి, ఎంపీ సహకారంతో చేగుంట మండలాభివృద్ధి..
మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో చేగుంట మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ మంచిక ట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. చేగుంటలోని మండల వ నురుల సముదాయంలో రూ.15లక్షల నిధులతో చే పట్టిన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి ఎంపీటీసీ శంభుని రవి, సొసైటీ డైరెక్టర్ అయిత రఘురాములు, నాయకులు బక్కి రమేశ్, రాములుగౌడ్ ఉన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధి
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో చిన్నాఘన్‌పూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణగౌడ్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.5లక్షల వ్యయంతో బీసీ కాలనీ నుంచి ఆలయానికి వెళ్లే దారిలో సీసీరోడ్డు వేశారు. ఈ మేరకు సీసీ రోడ్డుపై క్యూ రింగ్ కోసం కట్టలు కట్టించి నీళ్లు పోయించారు. అ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సావిత్రీరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు సందీప్, కాలనీవాసులున్నారు.
తూప్రాన్‌లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
మున్సిపల్లోని 6వ వార్డులో రూ. 8.5లక్షల 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ ప్రారంభించా రు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నంధ్యాల శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతీరవీందర్గుప్త్తా, మామిండ్ల కృష్ణ పాల్గొన్నారు.