నిజాంపేట,ఏప్రిల్8: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులను మోసం చేస్తున్నదని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చల్మెడలో ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నల్ల జెండాలు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత అభ్యన్నతికి సీఎం కేసీఆర్ నిత్య శ్రామికుడిలా కృషి చేస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వంతో కొట్లాడి వడ్లను కొనిపిస్తామని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలులో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు వారి ఉసురు తగులుతుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన నంద్యాల నర్సింహారెడ్డి, గ్రామస్తుల సహకారంతో నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన హోమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, నార్లపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నాయకులు నాగరాజు, సురేశ్‌నాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందని ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఖాజాపూర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికత అవలంబించుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగానరేందర్, సర్పంచ్ నాగలక్ష్మి, ఎంపీటీసీ యాదగిరి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మైపాల్‌రెడ్డి, దేవాగౌడ్, సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.