మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, ఏప్రిల్8: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పరీక్షలకు హాజరుకావాలని మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరపు విద్యార్థులకు ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. ఈ పరీక్షలకు అన్ని గ్రూపుల విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనినాస్గౌడ్ శుక్రవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రామాయంపేట జూనియర్ కళాశాలలో రికార్డులు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు 11న ఉదయం 10గంటల నుంచి 1గంటల వరకు జరిగే ఎథిక్స్, 12న జరిగే ఎన్విరాన్ మెంటల్ పరీక్షలకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఈ రెండు పరీక్షలకు హాజరు కానిచో మొదటి సంవత్సరం ఫలితాలు నిలిపేస్తామని తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 7646 మంది విద్యార్థు లు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, లెక్చరర్లు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో..
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 11న నైతికత, మానవ విలువలు, ఈనెల 12న పర్యావరణ విద్య అనే అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నట్లు చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.