మెదక్, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని లేదంటే కేంద్రప్రభుత్వంపై యుద్ధానికైనా సిద్ధమేనని.. మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురా లు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చి న పిలుపు మేరకు గురువారం మెదక్ జిల్లా కేంద్రం లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మెదక్ ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయం నుంచి భారీ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మెదక్‌లోని రాందాస్‌చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులు పంటలు పండించుకోవడానికి ప్రాజెక్టులు నిర్మించారని, దీంతో పాటు 24గంటల కరెంటు, రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 5వేలు ఇస్తున్నదన్నారు. రైతు మరణిస్తే రైతుబీమా కింద రూ. 5లక్షలు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. బీజేపీ రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంటు ఇస్తుందా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్రంలో పండించిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిసారి పంటను పండించిన తర్వాత కేంద్రప్రభుత్వం మేం కొనమని కొర్రీలు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు.
పొంతన లేని మాటలు..
బీజేపీ నాయకులు పొంతనలేని మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్న నరేంద్రమోదీకి తెలంగాణ రైతాంగం త్వరలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ ఎల్ఐసీ, ఆర్డీనెన్స్ ఫ్యాక్టరీ, రైల్వే ప్రైవేటీకరణతో పాటు కరెంటు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ఇలా అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగుల జీవితాలు బుగ్గిపాలవుతాయని తెలిపారు.
నేడు పల్లెల్లో ఇంటిపై నల్ల జెండాలతో నిరసన..
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేసేంత వరకు పోరాటాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, జిల్లా కేంద్రంలో మహాధర్నాతో కేంద్రప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా టీఆర్ఎస్ నాయకులు, రైతాంగం ర్యాలీలతో పాటు మహాధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
శుక్రవారం పల్లెల్లోని ఇంటిపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపడుతారని చెప్పారు. 11న ఢిల్లీలో పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, మురళీధర్‌యాదవ్, రవీందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ర్యాకల శేఖర్‌గౌడ్, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీపీ యమున, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, మెదక్ జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, పట్టణ, గ్రామాల కమిటీ అధ్యక్షులు, యువ నాయకులకు, జిల్లాలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఇంటిపై నల్ల జెండా కట్టి.. నిరసనతెలిపి..
మండల కేం ద్రంలోని మండల టీఆర్ఎస్ అధ్యక్షు డు, మాజీ ఎంపీటీసీ సంజీవరావు పాటి ల్ కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గురువారం తన ఇంటిపై నల్ల జెండాను కట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తన మొండి పట్టును వదిలి అన్నదాతల రెక్క ల కష్టాన్ని చూసి యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట సోషల్ మీడియా అధ్యక్షుడు రమేశ్ ఉన్నారు.