మెదక్, ఏప్రిల్ 7 : సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో 201 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ప్ర భుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో వైద్యచికిత్స పొం దిన పేదలకు సీఎం సహాయనిధి ఆసరాగా ని లుస్తున్నదన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి ప్రతి జిల్లా కేంద్రం లో మెడికల్, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ ము న్సిపల్ చైర్మన్ చంద్రపాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
శ్రీరామ నవమి పురస్కరించుకొని 10న జిల్లా కేంద్రంలోని కొదండ రామాలయంలో నిర్వహించే సీతారామ కల్యాణానికి హాజరు కావాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులను ఆలయ కమిటీ అధ్యక్షుడు నరేందర్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంటికెళ్లి ఆహ్వాపత్రిక అందజేసి ఆహ్వానించారు. ఆయన వెంట ఆల య ఆర్చకుడు మధుసూదన్‌చారి, కమిటీ సభ్యులు మల్లేశం, దేవేందర్‌రెడ్డి, నందిని, శ్రీను తదితరులు ఉన్నారు.
రామాయంపేటలోని పాండుచెరువు కట్టవద్ద ఉన్న రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి రావాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ కొండల్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధిరాములు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎమ్మెల్యేతోపాటు ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి ఆహ్వానపత్రిక అందజేశారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 8న నిర్వహి స్తున్న వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠాపన ఉత్సవాలకు హాజరుకా వాలని ఎమ్మెల్యేతోపాటు ఎస్పీకి సర్పంచ్ నర్సింహారెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధ్దిరాములు ఆహ్వానపత్రిక అందజేశారు.