మెదక్, మార్చి 30: ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలాంటిదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 43 మంది లబ్ధిదారులకు రూ.43,04,988 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గత నెలలో రాష్ట్రంలో 12 లక్షల 50వేల మందికి లబ్ధి చేకూరిందన్నారు. 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ, దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంపీపీ యమునా జయరాంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు జయరాజ్, వసంత్‌రాజ్, విశ్వం, నర్వ లక్ష్మీనారాయణ, మేఘమాల, మెదక్ పట్టణ, మండల అధ్యక్షులు గంగాధర్, అంజాగౌడ్, ఏఎంసీ డైరెక్టర్ సాయిలు, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, మేడి మధుసూదన్‌రావు, దుర్గప్రసాద్, సాయిరాం, కృష్ణ, జయరాంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, సాంబశివరావు, రవీందర్, ఆంజనేయులు, సర్పంచ్ ప్రభాకర్, మెదక్ ఆర్ఐ చంద్రశేఖర్, వీఆర్ఏలు ఎల్లం, వేణు పాల్గొన్నారు.
పాపన్నపేటలో 58 మందికి లబ్ధి
పాపన్నపేట, మార్చి30: కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల పాలిట వరంలా మారాయని, రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షలా 50 వేల మంది లబ్ధి పొందారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం మండల కేంద్రంలో 58 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపిల్లలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. త్వరలో మెదక్ జిల్లా వ్యాప్తంగా 13 వందల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వారికి సొంత ఖర్చులతో కోచింగ్ ఇప్పిస్తామన్నారు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు సైతం జరగనున్నాయన్నారు. ఆనకట్ట కెనాల్ల అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరయ్యాయని ఆమె వెల్లడించారు. ధాన్యాన్ని రిస్థితుల్లో కేంద్రమే కొనాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. పంజాబ్‌లో రెండు పంటలు సైతం కేంద్ర ప్రభుత్వం కొన్నప్పుడు తెలంగాణలో కొనకపోతే ఎలా అంటూ ఆమె ప్రశ్నించారు. చీకోడ్ గ్రామంలో గ్రామ దేవత ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గడీల శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు గౌస్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి , మండల సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు కు మ్మరి జగన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుభేరుడు, మిన్పూర్, మల్లంపేట, ఆరేపల్లి సర్పంచ్‌లు మర్రి లింగారెడ్డి, బాపురెడ్డి, శ్రీనాథ్‌రావు, గాంధారిపల్లి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ పాల్గొన్నారు.