నర్సాపూర్,మార్చి28: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తు న్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు హెచ్చరించారు. సోమవారం నర్సాపూర్‌లో కార్మికులు సమ్మె చేపట్టారు. పట్టణంలో ర్యాలీ తీసి అంబేద్కర్ చౌరస్తాలో మనవహారం నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను, ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంచాలన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని, ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పెంటయ్య, అన్నపూర్ణ, రమేశ్, కృష్ణ పాల్గొన్నారు.
చేగుంటలో..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. సోమవారం సార్వత్రిక సమ్మెలో భాగంగా చేగుంటలో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మండలంలోని అన్ని రంగాల కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. నవీన్, మురళి, మహేశ్, సంతో ష్, భాస్కర్, వెంకట్, యాదగిరి, బాలేశ్, నాగరాజు, మహేందర్, నాగరాజు, కుమార్, సత్తయ్య ఉన్నారు.
శివ్వంపేట..
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నదని అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు సువర్ణ అన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఆశవర్కర్ల మండల అధ్యక్షురాలు గోపమ్మ, అంగన్వాడీ టీచర్లు సండ్ర కవిత, జ్యోతి, అమృత, హేమలత, సుశీల, నవీన, పద్మ, రాణి, ఆశవర్కర్లు పద్మ, నిర్మల, షాహిని పాల్గొన్నారు.
కొల్చారం..
సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. మొదటి రోజు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు.
పెద్ద శంకరంపేట..
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్దశంకరంపేటలో పంచాయతీ కార్మికులు, ఆశవర్కర్లు, పోస్టల్ సిబ్బంది సమ్మె చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సౌందర్య, అరుణ, రాములు, నాగయ్య, లచ్చమ్మ, సాయమ్మ, సుశీల పాల్గొన్నారు.