వెల్దుర్తి, మార్చి 28: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్ది, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే లక్ష్యమని జడ్పీ డిప్యూటీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి సుభాషిణి అన్నారు. సోమవారం మండలంలోని శెట్పల్లికలాన్, యశ్వంతరావుపేటలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపీడీవో జగదీశ్వరాచారితో కలిసి పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలు, మౌలిక వసతులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలను పరిశీలించిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.
రామాయంపేటలో..
పట్టణంలోని బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో తీసుకుందని జిల్లా డివిజన్ల్ ఇంజినీర్ ప్రత్యేక అధికారి శ్రీనువాస్‌రావు తెలిపారు. ఈ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం సోమవారం కొలతలు తీసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమై న విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎంపీడీవో యాదగిరిరెడ్డి, కాలే రు ప్రసాద్, హెచ్ఎంలు సవిత, రాగి రాములు ఉన్నారు.
ప్రభుత్వ బడులకు వెలుగులు: ఆర్డీవో
మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడులు కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయని నర్సాపూర్ ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన చిలిపిచెడ్, చిట్కుల్, చండూర్, బండపోతుగల్, పైజాబాద్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపికైన ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతుల గురించి హెచ్ఎం, తహసీల్దార్, ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 12 పాఠశాలు ఈ కార్యక్రమంలో ఎంపికైనట్లు ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ మనాన్, ఎంపీడీవో శశిప్రభ, సర్పంచ్ గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, గ్రామ కార్యదర్శులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చేగుంటలో…
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు మన బడి కార్యక్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఎంపీడీవో ఉమాదేవి పేర్కొన్నారు. మండలంలోని చందాయిపేట ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో సోమవారం పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలను ప్రత్యేక అధికారి ఏఈ మమతకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత, టీఆర్ఎస్ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్, హెచ్ఎం ఊర్మిళ, పంచాయతీ కార్యదర్శి శ్రీవాస్తవ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.