హవేళీఘనపూర్, మార్చి 20 : లోక కల్యాణార్ధం సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి కూచన్పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర మహా చండీయాగం ఆదివారం రెండో రోజుకు చేరింది. ఆదివారం మాధవానంద సరస్వతి స్వామి సమక్షంలో చండీమాతకు ఎమ్మెల్సీ శేరి లక్ష్మీసుభాశ్రెడ్డి దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజలు కొనసాగాయి. వేదపండితులు అవాహిత దేవతాపూజా, రుద్ర చండీ పారాయణం నిర్వహించారు. సహస్ర మహాచండీ యాగానికి వచ్చిన భక్తులు ముం దుగా మాధవానందసరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. 160 మం ది రుత్వికుల సమక్షంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన యా గం మధ్యాహ్నం వరకు సాగింది. సాయంత్రం సూర్య నమస్కారం చేశారు. భక్తులకు భోజన వితరణ చేశారు. సహస్ర మహాచండీయా గం నిర్వహించడం ద్వారా అంతా మంచి జరుగుతుందని మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్‌రెడ్డి, కొ ల్చారం జడ్పీటీసీ మేఘమాల సంతోశ్, గ్రామ సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న, సిద్దిరెడ్డి, గోపాల్‌రావు, ఏడుపాయల ఆలయ డైరెక్టర్ మహిపాల్, పుట్టి అక్షయ్, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి,లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, శ్రీనునాయక్, స్వామినాయక్, ఎంపీటీసీలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
యాగంలో పాల్గొన్న ప్రముఖులు…
కూచన్పల్లిలోని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి వ్యవసా య క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర మహా చండీయాగంలో ఆదివారం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సతీమణి నీరజ పాల్గొన్నారు. వీరికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాధవానంద స్వామీ ఆశీర్వదాలు తీసుకున్నారు. యాగశాల చుట్టూ ప్రదక్షిణ లు నిర్వహించి చండీమాతకు పూజలు నిర్వహించారు. అతిథులకు ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి శాలువాలు కప్పి సత్కరించారు.