మెదక్ రూరల్, మార్చి 20 : విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, కార్యాచరణ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనతోపాటు నాణ్యమైన బోధనతో పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ బడులపై వైపే మొగ్గు చూపుతున్నారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ‘మన ఊరు- మన బడి’లో భాగంగా ఆంగ్ల మాధ్యమం అమ లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేలకువేల రూపాయల ఫీజు కట్టి పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పించిన తల్లిదండ్రులు.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధపడుతున్నారు.
మెదక్ మండలంలో..
‘మన ఊరు – మన బడి’లో మొదటి దశలో 7 పాఠశాలల ను ఎంపిక చేశారు. వీటిలో మంబోజిపల్లి (ఎంపీపీఎస్), మాచవరం (ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల), రాజ్‌పల్లి (ఎంపీపీఎస్), ఖాజీపల్లి (ఎంపీయూపీఎస్), మక్తభూపతిపూర్ (ఉన్నత పాఠశాల), తిమ్మనగర్ (ఎంపీపీఎస్) ఉన్నాయి.
ధర్మనిధిలో మంబోజిపల్లి ప్రాథమిక పాఠశాలకు కొత్త సొబగులు
మంబోజిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణ పచ్చని చెట్లతో శాంతినికేతను తలపిస్తున్నది. పాఠశాల ప్రహరీపై వేసిన అందమైన పెయింటింగ్, చిత్రాలు విద్యార్థులను కట్టి పడేస్తున్నాయి. నాణ్యమైన విద్యాబోధనతో విద్యార్థులు ఉత్సాహంగా బడికి వస్తున్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను 1982లో సర్పంచ్‌గా చిలుముల సిద్ధ్దిరాంరెడ్డి ప్రారంభించారు. 2020లో పల్లెప్రగతితో పాఠశాల ప్రగతికి పరిష్కరం లభించింది. అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి సూచన తో ధర్మనిధి ఏర్పాటు చేసి, సర్పంచ్ ప్రభాకర్, ప్రజాప్రతినిధు లు, గ్రామస్తుల సాయంతో టీచర్లు నర్సింహులు, కవిత పాఠశా లలో సమస్యల పరిష్కరించి, ప్రైవేట్ బడికి దీటుగా తీర్చిదిద్దా రు. ఉపాధి హామీ పథకం నిధులతో పా ఠశాలలో కిచన్షెడ్ నిర్మిం చడంతోపా టు మౌలిక వసతులు కల్పించారు. అప్పటి కలెక్టర్ పాఠశాలకు ఎల్డీ టీవీని అందజేశారు.
గోడ చిత్రాలతో విద్యాబోధన
రూ. లక్ష వ్యయంతో పాఠశాల భవ నంలోని అన్ని గదుల గోడలపై రంగుల తో వివిధ అంశాలపై చిత్రాలను వేయించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాల చి త్రాలు వేయించి, విద్యాబోధన చేస్తున్నా రు. ప్రైవేట్ బడులకు దీటుగా తరగతి గదులను ఆకర్షణీయం గా మార్చారు. చిత్రలేఖనం, క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చక్కటి విద్యాబోధన చేస్తున్నారు. కరోనా సమయంలో నిర్వ హించిన ఆన్లైన్ క్లాసులను ఇంటింటికి వెళ్లి పర్యవేక్షించారు.
పాఠశాలల్లో హరితహారంలో నాటిన మొక్కలు నేడు పెద్దయ్యాయి. ఉపాధ్యాయులు, విద్యార్థ్ధులు ప్రతి మొక్కనూ సంరక్షించడంతో పాఠశాల పచ్చనివనంగా తలపిస్తున్నది.
ప్రకృతి ఒడిలో పాఠశాల
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడం హర్షనీయం. ప్రతి ఉద్యోగం ఇంగ్లిష్తో ముడిపడి ఉంది మాతృభాషతో పాటు ఇంగ్లిష్ నేర్చుకోవడంలో తప్పులేదు. మంబోజిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పచ్చని చెట్లు, శుభ్రమైన ఆవరణ, ఆహ్లాదకర వాతావరణం చూస్తుంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చదిద్దుతున్నాం.
– నర్సింహులు, హెచ్ఎం
‘మన ఊరు- మన బడి’తో ఎంతో మేలు
‘మన ఊరు – మన బడి’ తో విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది . మా పాఠశాలలో బోధనతోపాటు కీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులను పోత్సహిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా పాఠాలను బోధిస్తూ విద్యార్థ్ధులకు క్షుణ్ణంగా వివరిస్తున్నాం. ఇంగ్లిష్‌తోపాటు మాతృభాషకు ప్రాధాన్యత పెరుగుతున్నది. దాతల సహకారంతో పాఠశాలలో చాలా సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
– కవిత, ఉపాధ్యాయురాలు, మంబోజిపల్లి
స్వచ్ఛంద సంస్థలు ముందు రావాలి
సీఎం కేసీఆర్ సార్.. ప్రభుత్వ పా ఠ శాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టడం సంతోషకరమైన విషయం. ‘మనఊరు -మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు సమకూర్చడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛం ద సంస్థలు ముందుకు వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం.
– గంజి ప్రభాకర్, మంబోజిపల్లి గ్రామ సర్పంచ్