రామాయంపేట, మార్చి18: రామాయంపేట బస్ స్టాండు ద్విచక్ర వాహనదారులకు అడ్డాగా మారింది. ఆర్టీసీ బస్‌స్టాండులో బస్సులు వెళ్లే దారిలోనే తమ ఆటోలు నిలుపుతున్నారు. దీంతో బస్సుల రాకపోకల కు ఇబ్బందులు కలుగుతున్నాయి. మరో వ్యక్తి బస్సులు నిలిపే చోటనే ద్విచక్రవాహనం నిలిపాడు. దీంతో బస్స్టాండులోకి వచ్చే ఆర్టీసీ బస్సులు లోనికి రాకుండా బయటి నుంచే వెళ్లిపోతున్నాయి. బస్సులు లోనికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించు కోకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నిలుపుతున్నారని ఆర్టీసీ కంట్రోలర్ తెలిపారు. వాహనాలకు పోలీసులు చలానాలు, జరిమానాలు వేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని కంట్రోలర్ కిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. వాహనం అడ్డంగా ఉంది తీయాలని బస్‌స్టాండు మైక్‌లో వారించినా వాహనదారుల్లో చలనం లేదు. ఈ విషయంలో రామాయంపేట పోలీసులు గట్టి చర్యలు తీసుకుని వాహనాలు స్వాధీనం చేసుకోవాలని ఆయన పేర్కొంటున్నారు.