సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో నిర్వహించే తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అవసరమయ్యే మొ క్కలను అందుబాటులో ఉంచేందు కు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఇందుకు కోటిన్నరకు పైగా మొక్కలను హెచ్ఎండీఏకు చెందిన నర్సరీల్లో పెంచుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల్లో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో పచ్చదనం పెంపొందించేందకు అర్బ న్ ఫారెస్ట్రీ విభాగం కీలకంగా పనిచేస్తున్నది. నగరం నలుమూలలా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 34 నర్సరీలను నిర్వహిస్తున్నారు.
రకరకాల మొక్కలు..
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్చేంజ్ల వద్ద హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్టీ విభాగం నర్సరీలను ఏర్పాటు చేసిం ది. అక్కడ వివిధ జాతులకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. ప్రధానంగా రాగి, మర్రి, గుల్ మొహర్, నెమలి నార, నందివర్ధనం, పొగడ, పర్కియా, జామ, ఈత, వేప, బా దం, కానుగ, గన్నేరు, చింత, బోగన్విల్లా, పాపయా, పెల్టోఫామ్, దేవ గన్నేరు, నేరేడు, బాంబూ, మిల్లి, గ్రీన్ ఫండా, మద్ది, వెలగ, సంపంగి, మందారం.. వంటి దాదాపు 100 రకాల మొక్కలను పెంచి పెద్ద చేశారు. వాటిని ఏడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలకు, స్థానిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు.