పటాన్చెరు, మార్చి 18 : వర్థ్ధమాన మార్కెట్లు తమ వ్యూహాత్మక కార్యక్రమాలను అంతర్జాతీయ వ్యాపారులను ఆకర్షించాయ ని, బహుళజాతి సంస్థలకు దీటుగా దేశీయ కంపెనీలు రాణిస్తున్నాయని అమెరికాలోని బోస్టన్లో ఉన్న సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రావి రామ్మూర్తి అన్నారు. గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ‘బహుళజాతి కంపెనీల అంతర్జాతీయ వ్యాపార ప్రణాళిక రూపకల్పనలో భారతదేశం పాత్ర’ అనే అంశంపై శుక్రవారం ఆయన ముఖ్య ఉపన్యాసం చేశారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో స్థిరమైన వ్యాపారవృద్ధిని నిర్ధారించడానికి బహుళజాతి కంపెనీలు అవలంబిస్తున్న అమ్మకం, వనరులు, ఆవిష్కరణలు, నేర్చుకోవడం అనే నాలుగు పార్శ్యాలను ఆయ న ఆవిష్కరించారు. జీఈ, జిల్లెట్, ప్యాంపర్స్, ఎం-బ్యాంకింగ్ వంటి ప్రపంచ బ్రాండ్ల గురించి ఆయన సోదాహరణంగా వివరించారు. తన మానస పుత్రిక రివర్స్ ఇన్నోవేషన్ ప్రక్రియను అనుసరించడాన్ని ప్రత్యక్ష ఉదాహరణలను ప్రొఫెసర్ రామ్మూర్తి పేర్కొన్నారు. ఆతిథ్య ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయడంలో గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ప్రొ ఫెసర్ క్రిష్ కీలక భూమిక పోషించారు. కార్యక్రమంలో బిజినెస్ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.