ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరాలి
సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డిలో బస్తీ పర్యటన
సంగారెడ్డి, మార్చి 15: ప్రభుత్వ, కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షపాతిగా మరోసారి సీఎం కేసీఆర్ నిలిచారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్ప ష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని 13వ వార్డు పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో స్థానిక కౌన్సిలర్ లావణ్యతో కలిసి పూజలు చేసి బ స్తీ పర్యటన ప్రారంభించారు. వార్డు పరిధిలోని కిష్టయ్యగూడెం, సాయినగర్, ఎంఆర్ఎఫ్ కాలనీల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 34వ వార్డు ఇందిరా కాలనీ, 14, 15, 16 వార్డుల్లో కౌన్సిలర్లు లావణ్య, సమీ, మాణెమ్మ, విజయలక్ష్మి, శ్రీకాంతనానితో కలిసి పర్యటిం చి అవసరమైన పనులను గుర్తించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహించే ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారన్నారు. ఐకేపీ సెర్ప్ లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్ర భుత్వ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలతో సమానంగా ఇస్తామని తీపికబు రు చెప్పారన్నారు. సీఎం ఉద్యోగుల పక్షపాతని మరోసారి రుజువు చేశారన్నారు.
జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ప్రకటించారని, నిధులను అవసరమైన చోట వినియోగిస్తామని చెప్పారు. ఇం దులో భాగంగానే ప్రజల వద్దకు వెళ్లి కాలనీల్లోని సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. పర్యటనలో సీడీసీ చైర్మ న్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లత, కౌన్సిలర్లు రామప్ప, శ్రీకాంత్, విష్ణువర్ధన్, అశ్విన్ కుమార్, సోహైల్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మోహన్‌సింగ్ నా యక్, అధికారులు ఇంతియాజ్ అహ్మ ద్, ఏఈ శ్రీకాంత్, సూపర్వైజర్లు శ్రీనివాస్, ఇంజినీరింగ్ అధికారులు, నాయకులు వెంకటేశ్వర్లు, నర్సింలు, చక్రపాణి, చిల్వరి ప్రభాకర్, బొంగుల రవి, హరికిషన్, కల్వకుంట నర్సింగ్‌రావు, రశీద్, ప్రభుగౌడ్, బత్తుల శ్రీనివాస్, ఎన్ఆర్ఐ షకీల్, అంజాద్, యూనుస్, అజీం, శ్రావణ్‌రెడ్డి, జలేందర్, ప్రభుగౌడ్, మురళీధర్, వాజిద్, ప్రవీణ్ కుమార్, పరశరామ్ నాయక్, ఆయా ప్రజలు పాల్గొన్నారు.