చిన్నశంకరంపేట/ నర్సాపూర్, మార్చి 13 : చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుకు ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మెదక్ పర్యటనకు వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి చిన్నశంకరంపేటలో ఘనస్వాగతం లభించింది. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్ తదితరులు మంత్రిని సన్మానించారు. మెదక్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, స ర్పంచ్‌లు యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి, దయానంద్, బం దెళ్ల జ్యోతి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాపాధ్యక్షుడు బాగారెడ్డి, నేతలు వడ్ల శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, జీవన్, హేమచంద్రం, వెంకటేశం ఉన్నారు. మంత్రి హరీశ్‌రావును మెదక్ లో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలను మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వెంట శివంపేట్ ఎంపీపీ హరికృష్ణ, వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్ ఉన్నారు.