శివ్వంపేట, మార్చి 11 : మండలంలోని పాంబండ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో మౌలిక వసతుల కల్పన, అదనపు గదుల నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పనపై రూ.1.85 కోట్ల అంచనా వ్య యంతో పనుల ప్రతిపాధనలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కలెక్టర్ కార్యాలయానికి పంపించారని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. ‘మన ఊరు -మనబడి’లో భాగంగా శుక్రవారం పాంబండ జడ్పీ పాఠశాలను సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ముందుగా బాలవికాస స్వ చ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మట్టి పూడికతీత పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ తలారి శివులు, ఉసిరికపల్లి సర్పంచ్ బాబురావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
నాణ్యతో సీసీ రోడ్లు నిర్మించాలి : పీఆర్ఏఈ సల్మాన్
సీసీరోడ్డు పనులను నాణ్యతతో నిర్మిం చాలని పంచాయతీరాజ్ ఏఈ సల్మాన్ అన్నారు. మెదక్ మండలంలోని మంబోజిపల్లి, ర్యాలామడుగు గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ ఉన్నారు.
టీఆర్ఎస్తోనే తండాలు అభివృద్ధి : ఎంపీపీ సబీత
టీఆర్ఎస్తోనే గ్రామాలు సస్యశామలం మారుతున్నాయని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మండలంలోని పెద్దతండాలో రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ ఛత్రీయ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులు చిందం రవీందర్, తౌర్యానాయక్, భిక్యానాయక్, ఆకుల మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
ప్రమాదకర విద్యుత్ స్తంభాలను తొలిగించాలి..
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలిగించాలని విద్యుత్‌శాఖ అధికారులకు చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. చేగుంట గ్రామపంచాయతీ సమీపంలో నిర్మించిన సీసీరోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలిగించాలని కోరారు.