మెదక్ రూరల్/ తూప్రాన్/ రామాయంపేట/ నిజాంపేట/ శివ్వంపేట, మార్చి 6 : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మే రకు మహిళాబంధు సంబురా లు జిల్లాలో ఊరూరా అంబరాన్నంటాయి. మెదక్ మండలంలోని బాలనగర్, పేరూరులో సర్పంచ్‌లు వికాస్కుమార్, జానకీరాంరెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. బాలనగర్లో మహిళా లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి, క్షీరాభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏగోండ పాల్లొన్నారు.
తూప్రాన్ మండలంలోని యావాపూర్, మల్కాపూర్, పోతరాజుపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడి ్డఅధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ లు కట్టారు. అనంతరం మహిళలను సర్పంచ్ న ర్సింహారెడి ్డసన్మానించారు. నిజాంపేట మండలం నస్కల్లో ఎంపీపీ దేశెట్టి సిద్ధ్దిరాములు అధ్వర్యం లో సంబురాలు నిర్వహించారురు. రామాయంపేట పట్టణంతోపాటు నందిగామ, రాంపూర్, తొ ని గండ్ల, కాట్రియాల, కిషన్ తండాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మహిళలు రాఖీలు కట్టారు. రామాయంపేట మున్సిపల్ ఆఫీస్‌లో చైర్మన్ జితేందర్‌గౌడ్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, ఆర్సీలు లావణ్య ఉన్నారు.
శివ్వంపేట మండలకేంద్రంలో టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, సర్పంచ్‌లు శ్రీనివాస్‌గౌడ్, అశోక్, స్వరాజ్యలక్ష్మీశ్రీనివాస్గౌడ్, బాలమణీనరేందర్, నేతలు కొడకంచి శ్రీనివాస్‌గౌడ్, బండారి గంగాధర్, కొండల్, నాగేశ్వర్రావు, జగన్‌రెడ్డి, షఫియొద్ద్దీన్, లక్ష్మీనర్సయ్య ఉన్నారు.
టీఆర్ఎస్ సర్కార్‌లోనే.. మహిళలకు పెద్దపీట
కొల్చారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మెదక్ ఏఎంసీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, ఎంపీపీ మంజుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గోదావరి, ఉమరాణి, నాగరాణి, మాధవి, మంజుల, ఝాన్సీలక్ష్మి, ఎంపీటీసీ ఉదయ, నాయకులు ముత్యంగారి సంతోష్, రాజాగౌడ్, గౌరీశంకర్, తుక్కాపూర్ ఆంజనేయిలు, సోమ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నది వెల్దుర్తి ఎంపీపీ స్వరూప అన్నారు. ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో హస్తాల్పూర్, జలాల్పూర్ గ్రామాల సర్పంచ్‌లు మమత, లత, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ అనంతరెడ్డి, నాయ కులు ముక్తాబాయి, గంగాధర్, నరేందర్‌రెడ్డి, ఆంజనేయు లు, కృష్ణాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను, వెంకటేశం, మహేశ్‌గౌడ్, మ హేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.
కౌడిపల్లిలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం నిర్వహించి, రాఖీలు కట్టి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కవిత, ఎంపీపీ రాజూనాయక్, ఎంపీటీసీలు స్వప్న, కాలేరు మంజుల, టీఆర్ఎస్ నేత రామాగౌడ్ పాల్గొన్నారు. చిలిపిచెడ్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షురాలు లక్ష్మీదుర్మారెడ్డి ఉన్నారు.
టేక్మాల్‌లో సర్పంచ్ సుప్రజాభాస్కర్, ఎంపీపీ స్వప్నారవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. టేక్మాల్ ప్రభుత్వ దవాఖానలో ఏఎన్ఎం భూదేవీని స న్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్ధ్దయ్య, మాజీ సర్పంచ్ వరలక్ష్మి, నాయకులు మల్లిక, అవినాశ్, సుధాకర్, సత్యనారాయణ, యాదగిరి, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో జరిగిన వేడుకల్లో జడ్పీటీసీ మాధవి, సర్పంచ్‌లు మీనా, జ్యోతి, నేతలు లక్ష్మారెడ్డి, రాజు, కృష్ణాగౌడ్, ప్రభాకర్, రవీందర్, శేఖర్‌గౌడ్, నరేశ్, మహిళలు పాల్గొన్నారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం : ఎస్సై శ్రీనివాస్‌గౌడ్
కొల్చారం, మార్చి 6 : మహిళల భద్రతకు పొలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కొల్చారం పొలీస్స్టేషన్లోమహిళా ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. షీ టీం, సఖీ కేంద్రా లు మహిళలకు అండగా ఉంటాయన్నారు. ఇబ్బందులు వస్తే 100 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, మెదక్ ఏఎంసీ వైస్‌చైర్మన్ సావిత్రిరెడ్డి పాల్గొన్నారు.
నేడు మహిళలకు క్రీడాపోటీలు…
మండలంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, ప్రజాప్రతినిధులకు క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీశ్వరాచారి తెలిపారు. వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరోరు. విజేత లకు మంగళవారం స్థానిక బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించే సమావేశంలో బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.