మెదక్, మార్చి 6: పేదలకు ఆపత్కాలంలో సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో మెదక్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అం దజేశారు. మెదక్ నియోజకవర్గంలో 101 మందికి రూ, 53.76లక్షలను అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, కౌన్సిలర్లు రాగి వనజ, మేడి కల్యాణి, దొంతి లక్ష్మి, ఆర్కే శ్రీనివాస్, సమీయొద్దీన్, లక్ష్మీనారాయణగౌడ్, జయరాజ్, ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాయిలు, టీఆర్ఎస్ హవేళీఘనపూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, మోచి కిషన్, ఉమర్, సుమన్, నవీన్ పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
చికిత్స పొందుతున్న బాధితుడికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అందజేశారు. అజ్జమర్రి గ్రామానికి చెందిన లింగమయ్య చికిత్సకు రూ.లక్ష విలువైన ఎల్వోసీని స్థానిక సర్పంచ్ పరశురాంరెడ్డికి హైదరాబాద్‌లో తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు.
ప్రాణాలను కాపాడుతున్న ‘సీఎంఆర్ఎఫ్’
సీఎంఆర్ ఎఫ్ పేదల ప్రాణాలను కాపాడుతున్నదని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ పేర్కొ న్నారు. వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు రూ.30వేల చెక్కును ఎంపీపీ ఆఫీస్‌లో బాధితుడి తండ్రి రామకృష్టయ్యకు అందజేశారు. కార్యక్రమంలో హస్తాల్పూర్ గ్రామ సర్పంచ్ మమత, నాయకులు నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ముక్తాబాయి ఉన్నారు. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన బొజ్జ యాదాగౌడ్‌కు రూ. 44వేల చెక్కును వైస్ ఎంపీపీ ఇందిరాకొండల్రెడ్డి, సర్పంచ్ కృష్ణవేణి అందజేశారు. వెంకటాపూర్(కే) గ్రామానికి చెందిన పో చయ్యకు రూ.18,500 చెక్కును జడ్పీటీసీ విజయ్‌కుమార్ అందజేశారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ కొండల్‌రెడ్డి, నేతలు రవీందర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, నందు ఉన్నారు.