మనోహరాబాద్/ తూప్రాన్/ నిజాంపేట/చిన్నశంకరంపేట, మార్చి 6 : ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతోపాటు ఉపాధి హామీ పథకంలో మం జూరైన నిధులతో గ్రామాల్లో సీసీరోడ్డు నిర్మాణాలు, పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో ప్రతి వారం ‘పల్లెప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స ర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ తెలిపారు. 23వ వారం పల్లె ప్రగతిలో భాగంగా రోడ్లను శుభ్రం చేసి, హరితహారం మొక్కలకు నీళ్లు పట్టారు. పల్లె ప్రగతిని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
తూప్రాన్ మండలంలోని మల్కాపూర్‌లో 297వ వారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలోని తుర్రెబాజ్‌ఖాన్ బ్లాక్‌లో చేపట్టిన స్వచ్ఛభారత్‌లో పరిసరాల పరిశుభ్రత పనులను చేపట్టారు. దాదాపు ఆరేండ్లుగా ప్రతి ఆదివారం రెండు గంటల పాటు స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్నట్లు సర్పం చ్ మహాదేవీనవీన్ తెలిపారు. కార్యక్రమం లో ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప స ర్పంచ్ ఆంజనేయులు, మేకిన్ మల్కాపూర్ యూత్ సభ్యులు, నేతలు పాల్గొన్నారు.
యావాపూర్‌లో సీసీ రోడ్డు పనులు..
తూప్రాన్ మండలం యావాపూర్‌లో 6, 7వార్డుల్లో రూ.6 లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను సర్పంచ్ నర్సిం హారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీలక్ష్మి, ఎంపీటీసీ సంతో ష్‌రెడ్డి, వార్డు సభ్యులు రామలక్ష్మి, బాలకృష్ణ ఉన్నారు.
వెంకటాపూర్(కె)లో అంతర్గత రోడ్డు పనులు
నిజాంపేట మండలంలోని వెంకటాపూర్(కే) గ్రామంలో రూ.10 లక్షల ఉపాధి నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను ఎంపీపీ సిద్ధిరాములుప్రారంభించారు. కార్యక్రమంలో సర్పం చ్ అనిల్‌కుమార్, చల్మెడ ఎంపీటీసీ బాల్‌రెడ్డి, కల్వకుంట పీఏసీఎస్ వైస్‌చైర్మన్ రాజేశం, టీఆర్ఎస్ నేత దయాకర్ ఉన్నారు.
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లిలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాఘవులు, టీఆర్ఎస్ నాయకుడు రవీందర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.