ఝరాసంగం, మార్చి 4: దక్షిణకాశీగా బాసిల్లుతున్న కేతకీ క్షేత్రంలోని పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో స్వామివారి విమాన రథోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. రథానికి రంగు రంగుల పువ్వులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్వతీ సమేత సంగమేశ్వరుడిని విమానరథంలో బసవేశ్వర దేవాలయం నుంచి నందీశ్వరుడి వరకు ఊరేగించారు. రథాన్ని భక్తులు తాళ్లతో లాగుతూ ‘ఓం నమః శివాయ, శంభో శంకరా’ అంటూ నామాస్మరణ చేస్తూ ముందుకెళ్లారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి, మాజీ ఆలయ చైర్మన్ వెంకటేశంగుప్తా, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీవో సుజాత, గ్రామ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, ఉపసర్పంచ్ మణెమ్మ, ఎంపీటీసీలు రజినిప్రియ, విజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల, గ్రామాధ్యక్షులు మఠం రాచయ్యస్వామి, ఏజాజ్బాబా, జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, సీఐలు భరత్‌కుమార్, రాజశేఖర్, ఎస్ఐలు రాజేందర్‌రెడ్డి, ఏడుకొండలు, వినయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు సంగమేశ్వర్, సంగారెడ్డి ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.