మెదక్ మున్సిపాలిటీ, మార్చి 4 : అర్బన్ పార్కులు, హరితవనాల్లో మొక్కలను నాటి సంరక్షించాలని అటవీశాఖ అధికారులకు అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి శరవణన్ సూచించారు. మెదక్ అటవీశాఖ కార్యాలయంలో హరితవ నాల పెంపు, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ఉమ్మడి మెదక్ జిల్లా అటవీశాఖ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతాలతోపాటు అర్బన్ పార్కుల్లో హ రితవనాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల జరుగకుండా ముందస్తు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణతోపాటు తాగునీటి ఇబ్బందులు రా కుండా సాసర్ ఫిట్లలో నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటర్ ట్యాంక్‌లతో నీరు నింపాలన్నారు. అట వీ ప్రాంతాల్లో నీరు లేకుంటే వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. సదస్సులో ఫ్లయింగ్ స్కాడ్ డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్, మెదక్, సిద్దిపేట, సం గారెడ్డి జిల్లాల అటవీశాఖ అధికారులు రవిప్రసాద్, శ్రీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లాలోని రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు.
హరితహారానికి సిద్ధం కావాలి : డీఆర్డీవో
మండలంలోని అన్ని గ్రామాల్లో హరితహారం మొక్కలను పెంచడానికి ప్రణాళికలు రూపొందించడమే చేయడమే కాకుండా హరితహారానికి అధికారులు సిద్ధ్దంగా ఉండాలని డీఆర్డీవో శ్రీనివాస్‌రావు ఆదేశించారు. ఝ రాసంగంలోని ఎంపీడీవో కార్యాలయం ఆయ న మాట్లాడారు. జూన్ నెలలో కురిసే తొలకరి జల్లులకే మొక్కలను నాటించాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మండలానికి వివి ధ రకాల మొక్కలను అందజేశామన్నారు. నర్సరీలు, పల్లె ప్ర కృతి వనాల్లో మొక్కలు ఎండిపోకుండా పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. మొక్కల సంరక్షణతోపాటు ఉపాధి జాజ్కార్డుల పం పిణీలో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉందన్నా రు. పనులను పెంచి, ప్రతి కూలీకి పని కల్పించాలని సూచిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుజాత, ఎంపీవో లక్ష్మ య్య, ఏపీవో రాజుకుమార్, కార్యదర్శులు పాల్గొన్నారు.