పెద్దశంకరంపేట, మార్చి 4: ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఆసరాగా నిలుస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన మొయినొద్దీన్‌కు సీఎం రిలీప్ఫండ్ కింద మంజూరైన రూ. 36వేలు, మండల పరిధిలోని చీలపల్ల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు రూ. 60వేలు, బల్రాంసింగ్ రూ. 26వేలు, మఖ్త లక్ష్మాపురం గ్రామానికి చెందిన ఇందిరమ్మకు రూ. 32వేలు చెక్కు ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పీఎసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, సర్పంచులు రమేశ్, ప్రకాశ్, ఎంపీటీసీ వీణా సుభాశ్‌గౌడ్, దామోదర్, నాయకులు మాణిక్‌రెడ్డి, పున్నయ్య, వెంకట్‌రెడ్డి, ఉన్నారు.
నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్
మనోహరాబాద్ : ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు.మనోహరాబాద్ జడ్పీ క్యాంపు కార్యాలయంలో ఆరుగురి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తూప్రాన్‌కు చెంది న సుగుణకు రూ.49 వేలు, ఇమాంపూర్ స్వప్నకు రూ.32, 500, లింగారెడ్డిపేటకు గోనయ్యకు రూ. 60 వేలు, స్వామిగౌడ్‌కు రూ. 25వేలు, జీడిపల్లికి ధనలక్ష్మీకి రూ. 40వేలు, ఇస్లాంపూర్‌కు లక్ష్మీకి రూ. 35వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అర్జున్, నాయకులు మన్నె నాగరాజు, పెంటాగౌడ్, భిక్షపతి పాల్గొన్నారు.