చేగుంట, మార్చి 4 : రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రం చేగుంటతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం ఎంపీ పర్యటించారు. చేగుంటలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణా సముదాయాలు, చేగుంటలోని ఆదర్శపాఠశాల వసతి గృహాలను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం చేగుంట ఎస్టీ బాలుర గురుకు ల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యలు విధులకు రాకుండానే హాజరు వేయడంపై అగ్రహాం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడి దవాఖానలో రోగులకు ఏలాంటి ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకోవాలన్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు బావ, విశ్రాంత ఉపాధ్యాయుడు పల్లె లక్ష్మీనారాయణ చేగుంటలో శుక్రవారం మృతి చెందగా, ఆయన కుమారుడు క్రాంతికుమార్‌ను పరామర్శించారు. చెరువులో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన సోమ శ్రీనివాస్, కిష్టాపూర్ మాజీ సర్పంచ్ బాలయ్య, పోతాన్‌శెట్టిపల్లి సర్పంచ్ నెల్లూర్ తండ్రి ఇటీవల మృతి చెందగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ చెర్యాల రఘుపతిరెడ్డి, గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ గన్యానాయక్ను ఎంపీ పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. చేగుంట మండలాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఎంపీ వెంట చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాడెం వెంగళ్రావు, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ల ఫోరం మం డలాధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ సండ్రుగు స్వామి, మాజీ సర్పంచ్ జగన్‌గౌడ్, చిన్నశివునూర్ సర్వంచ్ కొటారి అశోక్, నాయకులు పబ్బ నాగేశ్, రమేశ్, అంచనూరి రాజేశ్ ఉన్నారు.