కొల్చారం/నర్సాపూర్/మనోహరాబాద్/తూప్రాన్/ చిన్నశంకరం పేట/చిలిపిచెడ్,మార్చి 2: మహా శివరాత్రిని పురస్కరించుకొని చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివనామస్మరణ, భక్తి భజనలతో, శివపార్వతుల కల్యా ణం,శివలింగానికి అభిషేకాలు ప్రధాన పూజారులు మురళీధర్‌శర్మ, నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ జాతరలో రెండో రోజూ రామలింగేశ్వర స్వామి జాతరను పురస్కరించుకొని ఆలయం చుట్టూ ఎద్దుల బండ్ల ఊరేగింపు నిర్వహించారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా జాతర, అన్నదానాలు, బండ్లు, బోనాల ఊరేగింపులు జరిగాయి. చెట్లగౌరారంలో శల్మనాయగుట్ట వద్ద జాతర జరుగగా, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. రంగాయిపల్లిలో శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లింగారెడ్డిపేటలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వద్ద కల్యాణం, బోనాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీహరిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పెంటాగౌడ్, చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేటలోని సోమేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాలు రెండోరోజూ బుధవారం ఘనం గా నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ఎడ్ల బండ్లు ఊరేగించారు.
ఇస్లాంపూర్‌లో మల్లన్న జాతర
తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో మల్లన్న జాతర కొనసాగు తున్నది. బుధవారం ఒగ్గుకథ, బండ్లు తిరగడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుకన్య రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దచింతకుంటలో దుర్గాభవానీ జాతర
పెద్దచింతకుంటలో దుర్గాభవానీ జాతర రెండోరోజూ ఘనం గా నిర్వహించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ నాగరాజు, కో-ఆప్షన్ సభ్యుడు లక్ష్మణ్ ,వార్డు సభ్యు డు మల్లేశం, శ్రీ నూతన గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు యా దాగౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొల్చారంలో శివపార్వతుల కల్యాణోత్సవం
కొల్చారంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం బుధవారం కనుల పండువగా జరిగింది. శిథిలావస్థకు చేరిన శివాలయాన్ని రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి సూచనలతో గ్రామస్తులంతా కలిసి దాతల సహకారం తో పునర్నిర్మాణం గావించారు. అప్పటి నుంచి ఏటా మహాశివరాత్రి మరుసటి రోజున శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘ నంగా నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
నగరేశ్వరాలయ ,సోమేశ్వరాలయాల్లో ..
శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తుల పూజలతో మార్మోగాయి. హరహర శంభో శంకర అంటూ భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని శివ పార్వతుల కల్యాణాన్ని నిర్వహించారు. రామాయంపేట పట్టణంలో నగరేశ్వరాలయంలో మండలంలోని అక్కన్నపేటలో సోమేశ్వరాలయంలో తాటిపల్లి శ్రీనివాస్, బచ్చు భూమయ్య దంపతుల అధ్వర్యంలో శివపార్వతులకు కల్యాణం నిర్వహించారు. మంగళ వారం రాత్రంతా ఆలయంలోనే పూజా కార్యక్రమాలతో పాటు భజనలు చేస్తూ, భక్తి పాటలు పాడు తూ జాగరణ చేశారు. రామాయంపేట సంగమేశ్వర ఆలయానికి మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం పాల్గొనగా, ఎస్సై రాజేశ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తిమ్మాయిపల్లిలో..
ఉల్లితిమ్మాయిపల్లిలోని రాజరాజేశ్వరి దేవాలయంలో స్వామి వారికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేశారు. బుధవారం సాయంత్రం జాతర సందర్భంగా గ్రామంలోని భక్తులు ఇంటింటా ఎడ్ల బండ్లు,ట్రాక్టర్లతో ఉరేగింపు,బోనాలు తీసి మొక్కలు తీర్చుకున్నారు. ఉల్లితిమ్మాయిలపల్లితో పాటు,రెడ్డిపల్లి,అనంతసాగర్, రుక్మాపూర్, చేగుంట వివిధగ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలి రావడంతో దేవాలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది.
నార్సింగిలో..
నార్సింగిలోని మల్లన్న దేవాలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జాతరను ఘనంగా నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్థానిక నేతలు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.