మనోహరాబాద్, నవంబర్ 25 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని డీఈవో రమేశ్‌కుమార్ అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో ఫౌండేషనల్ లిట్రసీ, న్యూమెర్సీ సమక్షంలో తొలిమెట్టు ఆధ్వర్యంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను శుక్రవా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహరాబాద్ మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పలు ప్రాజెక్టులకు సంబంధించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ… గతంతో పోలిస్తే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ‘మనఊరు-మన బడి’తో కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చ దువుపైదృష్టి పెట్టాలని, తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రతిభకనబర్చిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్, ఎంపీటీసీ లావ ణ్యాముదిరాజ్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశ్‌ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ కాళిదాసన్, హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.