కొల్చారం, నవంబర్ 17 : సొసైటీల ఆర్థిక బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అధికా రులు, పాలకవర్గాలకు డీసీఎంఎస్ వైస్ చైర్మన్, రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగె రమేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. కొల్చా రం మండలంలోని రంగంపేట సొసైటీలో గురువారం 69వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. వారోత్సవాలను సొసైటీ చైర్మన్ రమేశ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించగా, జిల్లా సహకార అధికారి కరుణ, తెలంగాణ రాష్ట్ర సహకార శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ సంగీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. సొసైటీల ముఖ్య ఆదాయ వనరైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రైతు సంఘాలను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సహకార వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ క్రీడాపోటీల్లో విజేతలైన రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మంభోజిపల్లి శాఖ మేనేజర్ సౌభాగ్య, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సీఈవో నవీన్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్, భిక్షపతి, సర్పంచ్‌లు రమేశ్, సంతోశాఎల్లేశం, సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, డైరెక్టర్లు ఆకుల రమేశ్, సంగమేశ్వర్‌రెడ్డి, జీవయ్య, లక్ష్మీపెంటయ్య, బుజ్జిబాయ్, టీఆర్ఎస్ గ్రా మాధ్యక్షులు తలారి దుర్గేశ్, సురేశ్, రైతుబంధు కోఆర్డినేటర్ భూపాల్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.