రామాయంపేట, నవంబర్ 17 : పట్టణంలోని గురుకుల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులు గురువారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. జిల్లాకు చెందిన అగస్త్య ఫౌండేషన్‌కు చెందిన ప్రతినిధులు శ్రీకాంత్, దిగంబర్, రవళి అధ్వర్యంలో సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఫౌండేషన్ సహకారంతో విద్యార్థినులు వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. మానవ శరీర భాగాలు – వాటి విధులను వివరించారు. గుండె కొట్టుకోవ డం, అవయవాల పనితీరు, అహారంలో పోషకాల ఆవశ్యకత, ఖగోళ శాస్త్ర అంశాలు, భూభౌగోళిక అంశాలను విద్యార్థినులకు పాఠశాల ప్రిన్సిపాల్‌తోపాటు అగస్త్య ఫౌండేషన్ సభ్యులు వివ రించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు శాస్త్రీయ విద్యోబోధన చేయాలని సూచించారు. శాస్త్రీయ విజ్ఞానంతో ఆవిష్కరణలు ఉద్భవిస్తాయని వివరించారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ విజ్ఞానా న్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సరళాదేవి, అధ్యాపకులు సుభద్ర, పద్మ, దీప, రజి త, బిందు మాధవి, అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు.
పాపన్నపేట, నవంబర్ 17 : ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యప్రణాళిక ప్రకారం పాఠ్యపుస్తకంతోపాటు బోధనోపకరణాలతో విద్యాబోధన చేయాలని మండల విద్యాధికారి నీలకంఠం సూ చించారు. పాపన్నపేటతోపాటు మండలంలోని కుర్తివాడ, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న కాంప్ల్లెక్స్ సమావేశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాన్ని వినియోగిస్తూ, సోపానాలను అనుసరించి పాఠ్యాంశాలను బో ధించాలని సూచించారు. ఉపాధ్యాయుల విద్యాబోధనను పరిశీలించారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, అభ్యాసన సామ ర్థ్యాలను పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో తొలిమెట్టు మండల నోడల్ అధికారి అంజాగౌడ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతాప్‌రెడ్డి, హరిసింగ్, రిసోర్స్ పర్సన్లు స్వామి, ఎల్లం, బాలమల్లేశ్, సిద్ధ్దయ్య, సీఆర్సీలు మహేశ్వరి దేవయ్య, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
కొల్చారం, నవంబర్ 17 : మండలకేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో కళాఉత్సవ్- 2022 కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలవ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పది విభాగాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. కొ ల్చారం, కొంగోడు, వరిగుంతం, రంగంపేట, చిన్నాఘన్‌పూర్, ఎనగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలతోపాటు కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు కళాఉత్సవ్‌లో తమ ప్రదర్శనలు ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జిల్లాస్థాయి కళాఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు, వీటిలో విద్యార్థులు పాల్గొనాలని ఎంఈవో సూచించారు. మండలస్థాయి కళాఉత్సవ్ న్యాయ నిర్ణేతలుగా విజయ్మోహన్రాజ్, రమేశ్, నర్సింహులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది సంపత్‌కుమార్, రాజశేఖర్, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 18 : సైబర్ నేరాలు, నేరగాళ్ల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ సెల్ ఎస్సై మల్లయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో సైబర్ క్రైమ్‌తోపాటు షీటీమ్‌పై విద్యార్థుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మల్లయ్య మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని దొంగిలించి నేరాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. గుర్తు తెలియ ని నంబర్ల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్ చేసుకోవద్దని, ఒకవేళ రిసీవ్ చేసుకున్నా వ్యక్తిగత వివరాలు చెప్పొద్దన్నారు. చెడు నుంచి తమను తాము రక్షించుకోవాలన్నారు. మంచిగా చదువుకోని భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. షీటీమ్ ఏఎస్సై రుక్సానా బేగం, కానిస్టేబుళ్లు గంగామణి, విజయకుమార్ సైబర్ నేరాలు – నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యాపకులు ముస్తాక్ అహ్మద్, శ్రీనివాస్, కవిత, అహ్మాద్, పాషా, రమణ, మధుసూదన్‌రావు, రోహిణి, ప్రీతి, ఉస్మాన్, కవిత ఉన్నారు.