గుమ్మడిదల, నవంబర్17: మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలోని పట్టాభి సీతారామచంద్రస్వామి ఆల య 4వ వార్షికోత్సవంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. అనంతరం నల్లవల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మన్నె శ్రీకాంత్‌కు దివ్యాంగుల సంక్షేమశాఖ నుంచి జీవనోపాధి కోసం మంజూరైన రూ.50 వేల విలువైన చెక్కు అందజేశారు. కార్యక్రమం లో ఎంపీపీ సద్దిప్రవీణ, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, సర్పంచ్ వాసవీ దామోదర్‌రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవళిక గోవర్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేందర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
విశిష్ట అతిథిగా మాధవానంద సరస్వతి స్వామి
పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా గురు మాధవానంద ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను ఆయన ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దేవాలయాలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లుతారన్నారు. ఆలయాల్లో నిత్యం దూపదీపనైవేద్యాలు జరుగుతుండాలన్నారు. నిత్యం దైవారాధన చేయాలని భక్తులకు సూచించారు.