తెలంగాణ ప్రభుత్వం ఈ-నామ్‌తో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహిస్తుండడంతో పత్తి రైతులకు కాసుల వర్షం కురుస్తున్నది. మార్కెట్‌కు వచ్చిన పత్తికి వ్యాపారులు పోటీపడి ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాలుకు అత్యధికంగా రూ.9040 ధర పలికింది. మార్కెట్ యార్డుకు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చారు. అత్యల్పంగా క్వింటాలుకు రూ.8750ల ధర పలికింది.
గజ్వేల్, నవంబర్ 11: పత్తి రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు అత్యధికంగా రూ.9040 ధర పలికిం ది. గజ్వేల్ వ్యవసాయ మా ర్కెట్ యార్డుకు ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని విక్రయించడానికి తీసుకొచ్చారు. అత్యల్పంగా క్విం టాలు రూ.8750 ధర పలుకగా, అత్యధికంగా క్వింటాలుకు రూ.9040 ధర పలికింది. ఆన్లైన్ బిడ్డింగ్‌తో పత్తి కొనుగోళ్లు నిర్వహిస్తుండడంతో వ్యాపారులు రైతులు తెచ్చిన పత్తిని పోటీపడి ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు.
గతేడాది పత్తి క్వింటాలుకు రూ.10 వేలకు పైగా పలికింది. ఈసారి కూడా రైతులకు అదేస్థాయిలో ధర పలుతుండడంతో పంట నష్టపోయిన రైతులకు తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాల రైతులు గజ్వేల్ మార్కెట్ యార్డుకు పత్తిని తెచ్చి విక్రయించాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తికి అత్యధికంగా క్వింటాలుకు రూ.9040 ధర పలికిందన్నారు. మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన రైతు కనకయ్య తాను పండించిన పత్తిని ఈనామ్ ద్వారా లక్ష్మీ ట్రేడర్స్ కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.9040 ధర చెల్లించారన్నారు. ఈ నామ్ ద్వారా రైతులు పత్తి విక్రయాలు చేసి అధిక ధర పొందాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు.