సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 29 : ఇటీవల నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివిధ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులు చేపట్టిన చర్యలపై జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని, నామమాత్రపు నివేదిక ఇవ్వరాదని స్పష్టం చేశారు.
అధికారులు తమ శాఖల పరిధిలో చేయాల్సిన ప నులను వేగంగా పూర్తి చేయించాలన్నారు. ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికలను వెంటనే పంపాలని సూచించారు. నిర్మాణాత్మక రీతిలో సరైన సమాధానం ఉండాలన్నారు. మండల, గ్రామసభల్లో సైతం ప్రజాప్ర తినిధులు ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వ్యక్తిగతంగా ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయం గా పరిశీలించాలనిసూచించారు. తదుపరి జడ్పీ సమావేశంలో గత సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై తీసుకు న్న చర్యలను సభ్యులకు వివరించాల్సి ఉంటుందన్నారు. ఆయా శాఖల వారీగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను నవంబర్ 20లోగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు. మండల పరిషత్ సమావేశాలకు మండల స్థాయి అధికారులు విధిగా హాజరుకావాలని, జిల్లాస్థాయి అధికారులు సైతం మండల సమావేశాల్లో పాల్గొనాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ, పం చాయతీ, ఇంజినీరింగ్, రోడ్లు, విద్య, వైద్య, ఆరోగ్య, ఇరిగేషన్, గిరిజన, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.