పటాన్చెరు/ రామచంద్రాపురం, అక్టోబర్ 19: కశ్మీర్ సరిహద్దులో బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఫ్లెక్సీ రెపరెపలాడింది. మంగళవారం జమ్ముకశ్మీర్ బార్డర్లో పాకిస్థాన్‌కు సమీపంలో చివరి గ్రామమైన తాంగ్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీని ఎండీఆర్ యువసేన సభ్యులు ప్రదర్శించారు. దాంతో పాటు సముద్రమట్టానికి ప్రపంచంలోనే మూడో ఎత్తయిన ప్రాంతం కర్దుగ్లా పాస్ వద్దనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రాజు అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఎండీఆర్ యువసేన సభ్యులు కశ్మీర్ వెళ్లారు.
ఈ సంఘం సభ్యులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీని బార్డర్‌లోని లడక్ జిల్లా చివరిగ్రామం తాంగ్లో ప్రదర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని అక్కడ ప్రదర్శించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్పు చెందిన సందర్భంలో సీఎం కేసీఆర్‌పై అభిమానంతో బార్డర్‌కు వచ్చామని టీఆర్ఎస్ నాయకులు, ఎండీఆర్ యువసేన సభ్యులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ విజయవంతం కావాలని తాము సాహసంగా మైనస్ డిగ్రీ సెల్సీయస్‌లో, సముద్ర మట్టానికి 17వేల 982 ఫీట్ల ఎత్తున మంచుకొండల్లో ఫ్లెక్సీని పెట్టి అభిమానం చాటుకున్నామని వారు తెలిపారు.