మెదక్ జిల్లాలో ఎనభై శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయని, ఇందుకోసం వైద్యసిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశ వర్కర్లు ఎంతో కృషి చేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలో రూ.కోటి 35లక్షలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయం, రూ. 85లక్షలతో నిర్మించిన తహసీల్ కార్యాలయాన్ని శుక్రవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో 99 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. త్వరలో అన్ని దవాఖానల్లో కొత్త స్కానింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తామన్నారు.
చేగుంట,అక్టోబర్07ః మెదక్ జిల్లాలో 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగడం సంతోషంగా ఉందని, దీనికి వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్ల కృషి ఎంతో ఉందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలో రూ.కోటి 35లక్షలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయం, రూ. 85లక్షలతో నిర్మించిన తహసీల్ కార్యాలయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి మంత్రి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అలాగే, 99మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రభుత్వదవాఖానల్లో 80శాతం ప్రసవాలు జరగడం సంతోషంగా ఉందని, ఇందుకు వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్ల కృషి ఎంతో ఉందన్నారు. దవాఖానల్లో అన్ని రకాల స్కానింగ్‌ల కోసం ప్రత్యేక మిషన్లు కొనుగోలు చేస్తున్నామని, మెదక్‌కు వారం రోజుల్లో కొత్త స్కానింగ్ మిషన్ వస్తుందన్నారు. గర్భిణులు పోషకాహారాన్ని తీసుకునే విధంగా అంగన్వాడీ, ఆశవర్కర్లతో పాటు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,స్థానిక ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆర్యోగం మరింత మెరుగు పరిచేందుకు వచ్చే నెలలో 6200 ఆయా, అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.ప్రతి ఒక్కరూ మితమైన ఆహారం తీసుకుని, కొంచెం శారీరక శ్రమ చేయడం ద్వారా సగానికి పైగా రోగాలు రాకుండా నివారించవచ్చాన్నారు.
బీపీ, షుగర్ వంటి వ్యాధులను అదుపు చేసినైట్లెతే ఆరోగ్య సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు.
ఆరోగ్యమంత్రిగా రాజకీయాల కంటే ప్రజల ఆరోగ్యం గురించే ఎక్కువ మాట్లాడుతున్నానని, ఆరోగ్యకరమైన సమాజానికి ఆరోగ్యకరమైన ప్రజలు ఎంతో ముఖ్యమన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టినకల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంతో పేదింటి ఆడపిల్లల పెండ్లికి లక్ష రూపాయల సాయం అందుతున్నదని, చేగుంటలో ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలను అందజేశామన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.
మంత్రి హరీశ్‌రావు సహకారంతో చేగుంటలో మండల పరిషత్ కార్యాలయం, తహసీల్ కార్యాలయాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య, మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మున్నూర్ రాంచంద్రం, సొసైటీ చైర్మన్లు సండ్రుగు స్వామి, వంటరి కొండల్‌రెడ్డి, మ్యాకల పరమేశ్, ఎంపీటీసీలు అయిత వెంకటలక్ష్మి, బక్కిలక్ష్మి, మెండె శోభ, మెతకు శ్రీనివాస్, శంబుని రవి, హోళియానాయక్, పట్నం నవీన్, బింగి గణేశ్, బెదరబోయిన భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్‌లు కుమ్మరి శ్రీనివాస్, కొటారి అశోక్, గణపురం సంతోష్‌రెడ్డి, బుడ్డ స్వర్ణలత, మనుమడుకల నర్సవ్వ, కారింగుల సంతోష, గీతా, నిర్మల, గొర్రె రేణుకతో పాటు ఎంపీటీసీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.