మెదక్ అర్బన్, అక్టోబర్ 7 : లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు భరోసా కేంద్రంలో ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొ న్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ఆగస్ట్టు 7న భరోసా కేం ద్రాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ అధ్వర్యం లో ఉమెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో భరోసా – సపోర్ట్ కేంద్రం ఫర్ ఉమెన్, చిల్డ్రన్ అనేది హింసకు గురయిన బాధితులకు భరోసాగా ఉంటుందన్నారు. ప్రైవేట్, పబ్లిక్ ప్రదేశాలు, కుటుంబంతోపాటు సంఘంలో బాధితులకు మద్దతు ఇవ్వడానికి భరోసా కేంద్రాలు పని చేస్తాయన్నారు. లైంగిక దాడులు లేదా వేధింపులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం ద్వారా సురక్షిత రక్షణ, వైద్య, న్యాయసాయం అందిస్తామని అన్నారు.
జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు పోక్సో, లైంగిక దా డులకు సంబంధించిన మొత్తం 10 కేసు లు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని సంబందిత పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యంగా బా ధిత మహిళలకు అత్మైస్థెర్యాన్ని పెంచి మె రుగైన జీవనానికి భరోసా కల్పిస్తామన్నారు. 24గంటల పాటు మహిళా పోలీసులు అందుబాటలో ఉంటూ బాధితులకు భ రోసా ఇస్తారన్నారు. మోసపోయిన బాధితులు మళ్లీ వంచన కు గురికాకుండా చూడడం, వారికి తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. పోక్సో, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో సత్వర న్యా యం చేయడానికి భరోసా కేంద్రానికి బదిలీ చేస్తారని తెలి పారు. భరోసా కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వ హించి, ఫిర్యాదు నమోదు చేస్తామన్నారు.
బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించడం, 164 సీఆర్పీసీ స్టేట్మెంట్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేసి, బాధితురాలికి షెల్టర్ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బాధితురాలు పోలీస్స్టేషన్చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. భరో సా కల్పించే అధికారులతో మనసు విప్పి జరిగిన అన్యాయాన్ని వివరించవచ్చని సూచించారు. తమకు ఎదురైన సమస్యను ఫిర్యాదు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని, అటువం టి వారికి అండగా నిలిచేదే భరోసా కేంద్రం అన్నారు. భరోసా కేంద్రం 24గంటలు సేవలు అందిస్తున్నదని, భరోసా తక్షణ వైద్య సహాయం అందిస్తుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కోర్టులో తుది పరిష్కారానికి సంబంధించిన ప్రతి కేసులో భరోసా కేంద్రం చట్టప్రకారం సహాయాన్ని అందిస్తున్నదని వివరించారు. భరోసా కేంద్రంలో తల్లిదండ్రులకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు.