పుల్కల్, సెప్టెంబర్ 16 : వారం రోజులుగా ఎగువ ప్రాం తాల్లో కురిసిన వర్షాలకు మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్టు జలసిరిగా మారింది. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఆ శాఖ అధికారులు మూసివేశారు. వారం రోజుల వ్యవధిలో ప్రాజెక్టులోకి 17టీఎంసీల నీరు వచ్చి చేరగా ఆ నీటిని ఎప్పటికప్పుడు నీటి పారుదల శాఖ అధికారులు దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 28.939 టీఎంసీలు నీరు ఉంది. ఎగువ నుంచి వస్తున్న కొద్దిపాటి వరద నీటిని జల విద్యుత్ కేంద్రం ద్వారా బయటకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మొన్నటి వరకు భా రీగా కురిసిన వర్షాల కారణంగా ఇండ్ల వద్దే ఉన్న రైతులు వాన లు తగ్గు ముఖం పట్టడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్న మయ్యారు.
పెరిగిన సందర్శకుల తాకిడి
సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గడంతో ప్రాజెక్టును తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్ర జలే కాకుండా వివిధ ప్రాంతా ల నుంచి సందర్శకులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా సిం గూరు ప్రాజెక్టు అనగానే అందరికి గుర్తొచ్చేది చేపలేనని, అందుకు చేపలను తినేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.