మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్ 15 : రజాకార్లతో పోరాడిన బైరాన్‌పల్లికి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.
గ్రామంలోని చారిత్రాత్మక బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాడినట్లు తప్పుడుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. కులమతాలకు అతీతంగా భూమికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరా టం చేసినట్లు తెలిపారు. బైరాన్పల్లిలాంటి ఎర్రగడ్డను కాషాయమయం చేయకూడదనే బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్తో కలిసి సీపీఎం పోరాటం చేస్తున్నదన్నారు.
తెలంగాణలోకి మతతత్వ, ఉన్మా ద పార్టీని అడుగుపెట్టనీయకూడదనే టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నటు తెలిపారు. బైరాన్‌పల్లి పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. సమరయోధులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ సర్కారుపై ఉద్యమించాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు.
రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పి, బీజేపీ సర్కారు రైతు వ్యరేక చట్టాలు తీసుకొచ్చినట్లు విమర్శించారు. అనంతరం ఆనాటి పోరాటంలో పాల్గొన్న సమరయోధులను తమ్మినేని వీరభద్రం శాలువాలతో సన్మానించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, బైరాన్‌పల్లి సర్పంచ్ బండి శ్రీనివాస్, సీనియర్ నాయకులు నక్కల యాదవరెడ్డి, మాజీ జడ్పీటీసీ దాసరి కళావతి, నాయకులు కాముని గోపాల స్వామి, రాళ్లబండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గోడ్డుబర్ల భాస్కర్, సుంచు విజేందర్ పాల్గొన్నారు.