గుమ్మడిదల, సెప్టెంబర్ 15 : మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు జంగటి మహేశ్వర్ అనారోగ్యంతో మృతిచెందాడు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో కిం దపడి తలకు గాయాలయ్యాయి. వెంటనే కుటుం బ సభ్యులు దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వైద్య ఖర్చు ల కోసం రూ.20వేలు అందజేశారు. కాగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందా డు. జిన్నారం, గుమ్మడిదల మండలంలోని తెలంగాణ ఉద్యమకారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే మహేశ్వర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతా పం తెలిపారు. వెంటనే తన సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డితో రూ.50వేలు పంపించి కు టుంబ సభ్యులకు అందజేశారు. జడ్పీటీసీ కుమార్‌గౌడ్, జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, మండల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, సర్పంచ్ తిరుమలవాసు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రుక్మారెడ్డి సంతాపం తెలిపారు. అంత్యక్రియలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.