సిద్దిపేట, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి దిశానిర్దేశం అవసరం . దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే అగ్రభాగాన నిలిపారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే తప్పకుండా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. భారత దేశ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది.
నాడు తెలంగాణ ఉద్యమం కోసం బయలు దేరిన రోజు రాష్ట్రం సాధించాక ఏమేమి చేసుకోవాలి అని ముందే ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. అందుకు అనుగుణంగా ఇవ్వాళ ఉద్యమ సమయంలో ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ కూడా చేసి చూపిన నేత మన సీఎం కేసీఆర్. ఇవ్వాళ కండ్ల ముందు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అవన్నీ సాధించుకున్నాం. ఎక్కడో పుట్టిన గోదారమ్మ ఇక్కడి తీసుకువచ్చి బీడు వారిన పొలాలకు మళ్లించడంతో ఇవ్వాళ భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. ప్రతి గుంట సాగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరికింది. ఇలా ఒక్కొక్కటి అన్ని చేసుకున్నాం.యావత్తు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది.75 ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేండ్లలోనే చేసి చూపిన మహా నాయకుడు సీఎం కేసీఆర్. కచ్చితంగా దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే .
దేశ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది.ప్రజల వద్దకు పాలన అందించాలన్న ఉద్దేశంతో 10 జిల్లాలు ఉన్న వాటిని 33 జిల్లాలు చేశారు. మండలాలు, డివిజన్ కేంద్రాలతో పాటు కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు.
దీంతో పాలన ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేరుతున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతుంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సముచితమైన స్థానం కల్పించారు. విధులు, నిధులతో పాటు ప్రతి నెలా గౌరవప్రదమైన వేతనం కూడా అందిస్తున్నారు. ఇలా స్థానిక సంస్థలను బలోపేతం చేసి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని రాష్ర్టాలు తెలంగాణ మాదిరిగా మారిపోతాయి. కొత్తగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. ఇవన్నీ యావత్తు దేశానికి ఆదర్శం.
దేశానికి కేసీఆరే శ్రీరామరక్ష
దేశంలో మోదీని ఢీకొట్టగలిగే ఏకైక నేత సీఎం కేసీఆర్. ఆయన నాయకత్వం లో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు తథ్యం. ప్రధాని నేతృత్వంలో దేశం అధోగతి పాలవుతున్నది. రూపాయి విలువ పడిపోతున్నది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు బతుకలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్నది. ఇప్పుడు దేశ ప్రజల దృష్టి తెలంగాణ వైపు మళ్లింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తాడు.
-మేఘమాల, కొల్చారం జడ్పీటీసీ
దేశాభివృద్ధిని మార్చే సత్తా ఉన్న లీడర్
దేశాభివృద్ధిని మార్చే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దుర్మార్గ పాలనను అంతమొందించాలంటే కేసీఆర్ దేశ రాజకీయాలకు రావాల్సిందే. కేసీఆర్ దేశాభివృద్ధికి కావాల్సిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచంలో రోల్‌మోడల్ దేశంగా నిలుపుతారు. దేశంలో అన్నివర్గాలను కలుపుకొని బీజేపీ ముక్త్ భారత్ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. ప్రజలందరూ కేసీఆర్‌కు అండగా ఉన్నారు.
-పబ్బ మహేశ్‌గుప్తా, జడ్పీటీసీ, శివ్వంపేట
కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయం
సీఎం కేసీఆర్ కేంద్రం లో చక్రం తిప్పడం ఖాయం. కేసీఆర్ రవాణా శాఖ మం త్రిగా ఉన్నప్పుడు రేగోడ్‌కు దవాఖాన, బస్టాండ్, నారాయణఖేడ్ నుంచి రేగోడ్ మీదుగా అల్లాదుర్గం బస్సులు, జహీరాబాద్ వయా రేగోడ్ నిజామాబాద్, బాన్సువాడ డిపో రేగోడ్‌లో రాత్రి ఉండే విధంగా ఆనాడు హామీ ఇచ్చి వెంటనే అమలు చేసిన ఘనత కేసీఆర్‌దే. ఎన్నో వాగ్ధానాలు నెరవేర్చిన సమర్థుడు, పట్టుదల, క్రమశిక్షణ కలిగిన నాయకుడు దేశంలో అరుదుగా ఉంటారు. తాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా దేశానికి ఎంతో అవసరమని, దేశ రాజకీయాల్లోకి రావాలి. మీ సేవలు దేశానికి చాలా అవసరం
-కొమ్మ నర్సింహులు, వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు, రేగోడ్
సీఎం కేసీఆర్‌తోనే దేశ భవిష్యత్
సీఎం కేసీఆర్‌తోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణలో ప్రతిపల్లెకు రోడ్డు సౌకర్యంతో పాటు వివిధ సంక్షే మ పథకాలు ప్రవేశపెట్టిన మహానాయకుడు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అన్నివర్గాలకు సముచిత న్యాయం చేకూరుతున్నది. అన్ని రాష్ర్టాల్లో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే దేశం క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కుతున్నది. అప్పులు లేని దేశంగా మారుతుంది.
-జేరిపోతుల సంధ్య, జడ్పీటీసీ, రామాయంపేట
ప్రజాకర్షణ కలిగిన నాయకుడు
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వంటి నాయకుడు వస్తే మార్పు ఉంటుంది. ఆయన ఒక ప్రజాకర్షణ కలిగిన నేత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. సీఎం కేసీఆర్ అమలు చేసే సంక్షేమ పథకాలు దేశంలో అమలవుతాయి. తద్వారా దేశం కూడా అభివృద్ధిబాటన ఆర్థిక ప్రగతి సాధిస్తుననదనే నమ్మకం ఉంది. దేశం అన్ని రంగాల్లో ముందుకువెళ్లేలా సమర్థవంతమైన పాలనను అందించగల ధీశాలి సీఎం కేసీఆర్ ఒక్కడే.
-కొలన్ రోజాబాల్రెడ్డి, బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్
చారిత్రాత్మక నిర్ణయం..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయంతో దేశంలో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్ప గల శక్తి, మేధస్సు ఉన్న నేత. తెలంగాణ నుంచి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం యావత్ తెలంగాణాకు గర్వకారణం. రాష్ర్టాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో దేశాన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తారు.
-పంబాల జ్యోతి, ఝాన్సీలింగాపూర్ సర్పంచ్, రామాయంపేట
కేసీఆర్‌తోనే పేదల బతుకుల్లో వెలుగులు
కేసీఆర్‌తోనే దేశంలోని పేదల బతుకుల్లో వెలుగులు నిండుతాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సేవలు ఎంతో అవసరం. పోరాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ సీఎం పదవి చేపట్టి దేశ ప్రజలు మెచ్చే ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశ పెట్టారు. ప్రజలకు అవసరమయ్యే ప్రతి అం శంపై అవగాహన కలిగిన నాయకుడు. కేం ద్రంలో ఇదివరకు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల అభివృద్ధిపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దేశ సంపదను రాష్ర్టాలకు వినియోగించడం లేదు. ఇప్పటికే కేం ద్రం అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధాలనాలపై కేసీఆర్ పోరాడుతున్నారు. సంక్షేమ పథకాలతో తెలంగాణను బంగారు మయం చేసిన కేసీఆర్‌పై దేశ ప్రజలందరూ ఎంతో విశ్వాసంగా ఉన్నారు. ఇంతటి అభిమానం ఉన్న నేతకు అన్ని రాష్ర్టాల్లోనూ ఆపూర్వ ఆదరణ లభిస్తున్నది. దేశ ప్రజలందరికీ న్యాయం చేయగల విజన్ కేసీఆర్‌కు ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు. ప్రజలందరికీ మేలు చేస్తారు.
-హేమలతాశేఖర్‌గౌడ్, జడ్పీ చైర్పర్సన్, మెదక్
దేశ రాజకీయాల్లో పెనుమార్పు
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే దేశరాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ దేశంలోనే రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపారు. నేడు యావత్ దేశం తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే కేసీఆర్ లాంటి సత్తా ఉన్న నాయకుడు అవసరం.
-పొట్లచెర్వు ఆంజనేయులు, జడ్పీటీసీ, హత్నూర
దేశరాజకీయాల్లో రాణిస్తారు..
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి యావత్ దేశం తెలంగాణవైపు చూస్తున్నది. రాష్ట్రంలో ఎలాగైతే కేసీఆర్ కీలకంగా మారారో దేశ రాజకీయాల్లో సైతం కీలకంగా మారుతారు. తెలంగాణ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశాన్ని సైతం అన్ని దేశాలు తలెత్తి చూసేలా చేస్తారు.
-నారాయణగౌడ్, సర్పంచ్, నాగులపల్లి, వట్పల్లి