మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 15 : పిల్లలు బాగుంటేనే దేశ బాగుంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రం మెదక్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలోని బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నులి పురుగులతో శరీరం ఎదుగుదల నిలిచిపోతుందన్నారు. పోషకాహార లోపం, రక్తహీనతతో నీరసించి, చదువుపై శ్రద్ధ చూపలేక ఏకాగ్రత లోపిస్తుందని తెలి పారు. నులి పురుగులతో పిల్లలు ఆనారోగ్యం పాలవుతారని, 1 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. పరిసరాల శుభ్రత తో సమస్యను అధిగమించవచ్చన్నారు.
ఈ దిశగా విద్యార్థు లకు అవగాహన కల్పించాలని సూచించారు. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి ఉపయోగించాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, స్వచ్ఛమైన నీటిని తాగాలన్నారు. నులి పురు గుల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్ట్టు, ఫిబ్రవరిలో ఆల్బెండజోల్ మాత్రలను అందజేస్తుందని చెప్పారు. జిల్లాలో 1,076 అంగన్వాడీ కేంద్రాలు, 1,062 పాఠశాల లు, 42 జూనియర్ కళాశాలలతోపాటు బడి బయట ఉన్న 1 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలు మొత్తం 2,21,000 మందిని గుర్తించామని, వారందరికీ మాత్రలు వేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు మాత్రలు వేసుకోని పిల్లలకు ఈ నెల 22న పంపిణీ చేస్తామన్నారు. మాత్రలతో దుష్పరిమాణాలు ఉండవన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జెమ్లా నాయక్, పాఠశాల ప్రధానాచార్యులు కవిత, వైద్యులు నవీన్, మణికంఠ తదితరులు ఉన్నారు.
పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
కొల్చారం/ మనోహరాబాద్/ నిజాంపేట/ రామాయంపేట/ తూప్రాన్/ చేగుంట/ పాపన్నపేట, సెప్టెంబర్ 15 : కొల్చారం మండల వ్యాప్తంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో ఎంపీపీ నవనీత మాత్రలను పంపిణీ చేశారు. నిజాంపేటలోని హరిజవాడ ప్రాథమిక పాఠశాలలో ఆశ వర్కర్లు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. విద్యార్థులు నిత్యం చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, హెచ్ఎంలు రవీందర్‌గౌడ్, సవిత సూచించారు.
రామాయంపేట, కోనాపూర్ పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో నులి పురుగుల నిర్మూలన సాధ్యమని తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్ ప్రాథమిక పా ఠశాల హెచ్ఎం లక్ష్మణ్ అన్నారు. మాత్రలు వేసిన తర్వాత పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించారు. చేగుంట, నార్సింగి మండలాల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వేశారు.