హుస్నాబాద్/సిద్దిపేట/సిద్దిపేట కమాన్/కోహెడ/మిరుదొడ్డి/దుబ్బాక, జూన్ 13 : హుస్నాబాద్ డివిజన్లోని అన్ని మండలాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సోమవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలకు మామిడి తోరణాలు, బెలూన్లు, రంగు రంగుల కాగితాలతో అలంకరించారు.
పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థుల కంటే ముందే పాఠశాలకు చేరుకొని చప్పట్లతో స్వాగతం పలికారు. దీంతో ఉత్సాహం విద్యార్థులు పాఠశాల గదుల్లోకి వెళ్లారు. మరికొన్ని చోట్ల విద్యార్థులకు జ్యూస్, స్వీట్లు అందజేసి స్వాగతం పలికారు. డివిజన్లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లోని అన్ని గ్రామాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అదేవిధంగా సిద్దిపేట, సిద్దిపేట కమాన్, గజ్వేల్, కోహెడ, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని అన్ని గ్రామాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి.