జిన్నారం, జూన్ 3 : మండలంలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామాల వారీగా సర్పంచ్‌లు, కార్యదర్శులు, పాలకవర్గంతో మొదటి రోజైన శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. గత పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు పరిశీలించారు. కొడకంచిలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను చేపట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సర్పంచ్‌లకు ఎమ్మెల్యే సూచించారు. గడ్డపోతారం, వావిలాల గ్రామాల్లో డీఎల్పీవో సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో రాములు పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాలను డీపీవో సురేశ్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వావిలాలలో గ్రామ క్రీడా ప్రాంగణం పనులను ఎంపీపీ రవీందర్‌గౌడ్, సర్పంచ్ సుశాంతితో కలిసి పరిశీలించారు. శివనగర్‌లో సర్పంచ్ రేఖాకృష్ణ, ఎంపీటీసీ సంతోషమహేశ్ పాలకవర్గంతో కలిసి గ్రామంలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ శివరాజ్, ఎంపీవో రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
సిర్గాపూర్, జూన్ 3: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే గ్రా మాలు అభివృద్ధి చెందుతున్నాయని మండల పరిషత్ అధ్యక్షుడు జార మహిపాల్‌రెడ్డి అన్నారు. అంతర్గాంలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సర్పంచ్ రవీందర్పాటిల్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుధ్యం, తాగునీరు, తదితర అభివృద్ధి పనులపై అధ్యయనం చేశారు. ప్రభుత్వ భూములు ఉంటే వాటిని కాపాడాలని, పాత భవనాలు, పాత బావులు ప్రమాదకరంగా ఉన్న వాటిని పూ డ్చి వేయాలని ఎంపీడీవో సుజాత గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మీనాక్షి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
న్యాల్కల్, జూన్ 3: పల్లెప్రగతి, తెలంగాణ హరితహారం కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆర్‌డబ్లూఎస్ ఈఈ సాబేర్హుస్సేన్, మండల పంచాయతీ అధికారి నాగభూషణం, సూపరింటెండెంట్ రాజశేఖర్, ఈజీఎస్ ఏపీవో రంగారావు అన్నారు. మండలంలోని హుస్సేల్లి, మిర్జాపూర్(ఎన్), టేకూర్, ముంగి, మెటల్‌కుంట, మిర్జాపూర్(బి), చాల్కి, న్యామతాబాద్, కల్బేమల్, రేజింతల్, మామిడ్గి, చీకూర్తి, కాకిజనవాడ తదితర గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించారు. ఎనిమిదో విడుత హరితహారం పథకం కింద ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుకోవాలన్నారు. సమావేశాల్లో ఆయా గ్రామాల సర్పంచులు సుధారాణి, చంద్రన్న, సరిత, ఫిటర్, కుతుబొద్దీన్, శకుంతల, మల్లారెడ్డి, అమీర్, కార్యదర్శులు పాల్గొన్నారు.
కంగ్టి, జూన్ 3: టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కో సం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, రెండేండ్లుగా పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని తడ్కల్ సర్పంచ్ గడ్డం మనోహర్ అన్నారు. గ్రామం లో పల్లెప్రగతి కార్యక్రమంపై గ్రామసభను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి నాగార్జున, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.
నారాయణఖేడ్, జూన్ 3: పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని నారాయణఖేడ్ ఎంపీపీ చాందిబాయి చౌహాన్ అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం కాగా, చల్లగిద్ద తండాలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని పనులు పల్లె ప్రగతి ద్వారా పరిష్కారమయ్యాయన్నారు. స్థానిక సర్పంచ్ సుశీల రమేశ్చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన పనుల విషయమై చర్చించి పలు పనులను గుర్తించారు. పగిడిపల్లిలో సర్పంచ్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొని పల్లె ప్రగతిని విజయవంతం చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
రాయికోడ్, జూన్ 3: తెలంగాణ ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి పరిచేందుకు పల్లె ప్రగతి పథకం ప్రవేశ పెట్టిందని ఎంపీడీవో వెంకటేశం అన్నారు. యూసుఫ్పూర్ గ్రామంలో ఐదో విడుత పల్లె ప్రగతి పథకం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో మండల ఉపాధిహామీ అధికారి తుక్కప్ప, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఝరాసంగం,జూన్ 3: ఝరాసంగంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిపై గ్రామ సభ నిర్వహించా రు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలో ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కలిసి కట్టుగా అభివృద్ధి చేద్దామంటూ ప్రజలకు సూచించారు.
గుమ్మడిదల, జూన్ 3: మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు బొంతపల్లి, అన్నారం, కానుకుంట, మంభాపూర్, అనంతారం, వీరన్నగూడెం, నాగిరెడ్డిగూడెం, వీరారెడ్డిపల్లి, రాంరెడ్డి బావి, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, మండల ప్రత్యేకాధికారి ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ పర్యవేణలో పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు.
సంగారెడ్డి అర్బన్, జూన్ 3: పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు సూచించారు. ఇరిగిపల్లి లో శుక్రవారం ఎంపీడీవవో ఆకుల రవీందర్‌తో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సభను నిర్వహించి ముందస్తు ప్రణాళికతో చేపట్టాల్సిన పనులను వివరించారు. అనంతరం ఎంపీడీవో రవీందర్ ఫసల్వాది గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించి గ్రామ సభ నిర్వహించారు.
కోహీర్, జూన్ 3: పల్లెప్రగతిని 15రోజుల పాటు పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొత్తూర్ గ్రామంలో పల్లెప్రగతిపై చేపట్టిన గ్రామ సభలో జడ్పీ సీఈవో మాట్లాడారు. వర్షాకాలంలో రోగాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో సుజాతనాయక్, ఎంపీవో వెంకట్‌రెడ్డి, పాల్గొన్నారు.
మునిపల్లి, జూన్ 3: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిబాటలో పడుతున్నట్లు సంగారెడ్డి డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు తెలిపారు. చిన్నచెల్మెడ, బుసారెడ్డిపల్లి, పెద్దగోపులారం గ్రామాల్లో పర్యటించి గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధిబాటలో ముందుండటానికి మంచి అవకాశం అన్నా రు. చిన్నచెల్మెడ, బుసారెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మా ణం చేపడుతున్న క్రీడా మైదానాలను పరిశీలించారు. కం కోల్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ సమావేశంలో ఎంపీపీ గౌడిగామ శైలజాశివశంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్చంద్ర కులకర్ణి, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.