పాపన్నపేట/శివ్వంపేట/చిలిపిచెడ్/నిజాంపేట/రామాయంపేట/నర్సాపూర్, మే 30 : పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఐదో విడుత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు,అధికారులతో పల్లెప్రగతి పనులపై నిర్వహించిన సమీక్షలో ఎంపీపీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విడుతల వారీగా చేపట్టిన పల్లెప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు.
జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో విడుత పల్లెప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నిజాంపేట మండలంను సుందరంగా తీర్చిదీద్దాలన్నారు. నందిగామ,రాంపూర్ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కోసం రూ.4.16 లక్షలతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంపీవో రాజేందర్, ర్పంచ్‌లు అనూష, చంద్రవర్ధిని, కృష్ణవేణి, నర్సింహారెడ్డి.అమరసేనారెడ్డి, అరుణ్‌కుమార్, ఎంపీటీసీ సురేశ్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, విద్యుత్ ఏఈ సంతోశ్ కుమార్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ సర్పంచ్‌లు తమ బాధ్యతగా నిర్వహించి విజయవంతం చేయాలని రామాయంపేట మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రావు, ఎం పీపీ నార్సింపేట భిక్షపతి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని ఏర్పా టు చేసి పలు సూచనలు సలహాలిచ్చారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జడ్పీటీసీ బాబ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఐదో విడు త పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ జ్యోతి సురేశ్ నాయక్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, ఎంపీడీవో మార్టిన్ లూథర్, తహసీల్దార్ భాస్కర్, మండల ప్రత్యేకాధికారి జనార్దన్‌రావు అధికారులు పాల్గొన్నారు.
ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో పల్లెప్రగతిపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఏఈ దుర్గాప్రసాద్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జూన్ 3 నుంచి నిర్వహించే ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు,నాయకులు విజయవతం చేయాలని ఎంపీపీ వినోద దుర్గారెడ్డి కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,గ్రామ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో శశిప్రభ, ఎంపీవో కృష్ణమోహన్,ఎంపీవో శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.
పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన పల్లె ప్రగతి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రేగోడ్/పెద్దశంకరంపేట మే 30 : పెద్దశంకరంపేటలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ‘పేట’ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. జడ్పీటీసీ విజయ రామరాజు, ఇన్చార్జి తహసీల్దార్ చరణ్ సింఘ్, ఇన్చార్జి ఎంపీడీవో రియాజుద్దీన్, వసంత్, రైతుబంధు అధ్యక్షుడు సురేశ్ గౌడ్, ఆయా గ్రామ సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.