సంగారెడ్డి న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 21: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివా రం సంగారెడ్డి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయా కార్యాలయాల వద్ద మొక్కలు నాటారు. నాయకులు, మహిళలు కలిసి గ్రామా ల్లో హరితహారం మొక్కలను నాటారు. సంగారెడ్డి పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయ ఆవరణలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ 75మొక్కలు నాటారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన హరితహారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి విడుత హరితహారంలో నాటిన మొక్కలు చెట్లుగా మారి ప్రాణవాయువును ఇస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో కాలుష్యంతో దుర్వాసనలు వచ్చేవని, ఇప్పుడు ఆ సమస్య తగ్గుతున్నదన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పట్టణంలోని క్యాం పు కార్యాలయంలో మొక్కలు నాటి నీరు పోశారు.