తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకొంటున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ పెద్దచెరువు కట్టపైన గంగామాత దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోనే తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మన్నెవారి జలాల్పూర్లో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పోచమ్మ, దుర్గమ్మ, గ్రామదేవతల కు బోనాలను సమర్పించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎ మ్మెల్యే వెంట జిల్లా కోఆప్షన్ మన్సూర్, సర్పంచ్ రంగి లతక్రిష్ణ, నాయకులు ప్రతాప్‌రెడ్డి, కిట్టు, మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శేఖర్, పెంట్యా, సర్పంచ్‌లు శేఖర్, మల్లేశంగౌడ్, శంకర్‌రెడ్డి, పలువురు నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
-వెల్దుర్తి, ఆగస్టు 22