రామాయంపేట, ఆగస్టు 4 : మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిఒక్కరూ మొక్కల పర్యవేక్షణ బాధ్యత తీసు కోవాలని ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. రాయిలాపూర్ గ్రా మంలో గురువారం ప్రజలకు పూలు, పండ్ల మొక్కలను అందజేశారు. అనంతరం పెదరాయుని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మొక్కలను నాటి, అవి పెరిగి పెద్దయ్యే వరకు జాగ్రత్తగా కాపాడాలని అన్నారు. మొక్కల పెంపకంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే హరితహా రం విజయవంతం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ వో గిరిజారాణి, సర్పంచ్ నర్సాగౌడ్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, కార్యదర్శి మహేందర్, టీఆర్ఎస్ నేత సార్గు భిక్షపతి ఉన్నారు.
చిన్నశంకరంపేట, ఆగస్టు 4 : నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సర్పంచ్లు లక్ష్మణ్, సాయిలు తెలిపారు. అంబాజిపేట, రుద్రారం గ్రామా ల్లో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని రక్షించుకోవడం అంతే ముఖ్యమన్నారు. వనాలు ఉంటేనే వర్షాలు కురుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి కావాలి.. స్వచ్ఛమైన గాలి కావాలంటే మొక్కలు నాటాలని సూచిం చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నిజాంపేట, ఆగస్టు 4 : నస్కల్ గ్రామంలో ఇంటింటికీ 6 మొక్కలను ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పంపిణీ చేశారు. మొక్కలను నాటి సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు చక్కటి ఆరో గ్యం సిద్ధిస్తుందన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటాలని ప్రజలకు ఎంపీపీ సూచించారు.కార్యక్రమం లో సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత ఉన్నారు.
పెద్దశంకరంపేట, ఆగస్టు 4 : మొక్కలను నాటి, సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బూర్గుపల్లి సర్పంచ్ సరితామల్లేశం అన్నారు. భూర్గుపల్లి గ్రామంలో ఇంటింటికీ ఐదు మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలపైనే మానవ మనుగడ అధారపడి ఉందని సర్పంచ్ వివరించారు.
కొల్చారం, ఆగస్టు 4 : ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందజేస్తున్నట్లు ఎంపీపీ మంజుల తెలిపారు. ఎనగండ్ల గ్రామంలో మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఇంటి ఎదుట కరివేపాకు, మునగ, నిమ్మ తదితర మొక్కలను పెంచాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు.
శివ్వంపేట, ఆగస్టు 4 : మొక్కల పెంపకంతోనే ప్రతి ఊరు వనంగా మారాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. ఎంపీపీ చాంబర్లో ఆయన మాట్లాడుతూ.. హరితహారాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు దృఢ సంకల్పంతో పనిచేయాలని కోరారు. నెలాఖరు వరకు నిర్దేశించిన మొక్కలను నాటాలని ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్లు సోనీరవినాయక్, ఫణీశషాంక్శర్మ ఉన్నారు.