పెద్దశంకరంపేట, ఆగస్టు 4 : ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో ముగ్గురికి సీఎం రిలీప్ఫండ్ చెక్కులను అందజేశారు. మల్కాపురం గ్రామానికి చెందిన భూపాల్‌కు రూ.28వేలు, గొట్టిముక్కుల గ్రామానికి చెం దిన కె.విఠల్‌గౌడ్‌కు రూ.40వేలు, నీరుడు శ్రీనివాస్‌కు రూ. 15వేల చొప్పున సీంఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు, ఎంపీటీసీల ఫోరం మండలా ధ్యక్షుడు బోండ్ల దత్తు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, సర్పంచ్ ఉదయశ్రీసూర్యప్రకాశ్, నాయకులు అశోక్, వెంకటేశ్, రాంచందర్ తదితరులున్నారు.
నర్సాపూర్, ఆగస్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తుల్జారాంపేట్కు చెందిన డి.జ్యోతికి మంజూరైన రూ. 60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకే సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసి, ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నా రు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు చంద్రశేఖర్, రమణాగౌడ్, నాయకులు నగేశ్, ఆంజనేయులు, గొర్రె వెంకట్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి ఉన్నారు.