చేగుంట, జూలై24: నేషనల్ హైవేలో కల్వర్టుల నిర్మాణం సరిగా లేక వర్షాలు పడ్డప్పుడల్లా ఇబ్బందులు తలెత్తున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నార్సింగి 44వ జాతీయ రహదారి వల్లభాపూర్ వద్ద రోడ్డు, కల్వెర్టులను, మక్కరాజిపేట రోడ్డును ఎంపీ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్భాపూర్ వద్ద బాక్స్ కల్వర్టు కట్టకుండా చిన్న పైపులు వేయడంతో వర్షం కురిసినప్పుడు హైవే పైకి వరద వస్తున్నదన్నారు.
నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి బాక్స్ కల్వెర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పెద్ద వానలు వచ్చినా ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నార్సింగి నుంచి వల్భాపూర్‌కు వరకు రాంగ్ రూట్లో రాకుండా సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
సర్వీస్ రోడ్డు లేక ఎంతో మంది మృత్యువాత పడ్డారని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డుతో పాటు బాక్స్ కల్వర్టు కట్టిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాలకు చేగుంట, గజ్వేల్ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో అక్కడా పైపులైన్లు వేయిస్తానన్నారు.
చేగుంట, నార్సింగి మండలంలోని పలు గ్రా మాల్లో నిర్వహించిన మహంకాళి బోనాల్లో ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆల య కమిటీ సభ్యులు ఎంపీని శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాణపు రం కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు మైలరాంబాబు, మాజీ అధ్యక్షుడు తౌ ర్యనాయక్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, అంచనూరి రాజేశ్, ఎంపీపీ శ్రీనివాస్, మండ ల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మీ, సొసైటీ చైర్మన్ సండ్రుగు స్వామి, ఎర్ర యాదగిరి పాల్గొన్నారు.